Pages

Wednesday, November 28, 2012

నవ లబుక్యో



ఈ మధ్యనే  ఆఫీస్ నుండి రూమ్ కి  ట్రైన్ లో వెళ్తుంటే ఇనుప ఊచ చిన్నది  చొక్కాకి తగిలి హాండ్స్ దగ్గర చిరిగిపోయింది.

కొత్త చొక్కా కొనుక్కుందామని షో రూమ్ వైపు వెళ్ళాను
చలికాలం లో బట్టల షాపు వాడు వేసిన   AC కి నాకు చిరాకొచ్చి ఒక సూక్తి నా నోట్లో నుండి వచ్చింది
"చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో" అని
వెంటనే బుక్ స్టోర్ వైపు పరుగులు తీశాను



అలా ముంబై ఫేమస్ అయిన బుక్స్ దొరికే ఏరియా లోకి ప్రవేశించాను

                                  

న్యూ అరైవల్స్ చూపించు అని అడిగితే ఇష్టమొచ్చిన నవల్స్ అన్నీ చూపించాడు
ఇది బావుంటుంది సార్  ఇది చూడండి  సార్  థ్రిల్లర్,బెస్ట్ సెల్లర్ అని ప్రాసలతో పిచ్చెక్కించాక 
ఒక అరగంట గడిచాక నాకొద్దు నాకేమీ నచ్చలేదు అని చెప్పినా ఏంటి కొనకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ అరగంట నా శ్రమ వృధా అని తిరిగి గొడవ పెట్టుకున్నాడు

 నాకు ఇష్టంలేదు ఆల్రడీ చదివేసినవే ఉన్నాయి అని చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు
కొను  కొను అని మరో పది నిమిషాలు అరిచాడు

నా సహనం లిమిట్ క్రాస్ అయ్యి పిచ్చి పీక్స్ కి  shift అయిపోయింది

వీడెవడురా బాబు డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు ఏం చెయ్యనురా దేవుడా అని రెండు నిమషాలు ఆలోచించాను

అదే టైం  లో తెలుగు బ్లాగులు పోస్ట్ కి ఎవరో మహనీయుడు నా పాలిట  దేవుడు లా  కామెంట్ పెట్టారు.
తెలుగు బ్లాగులు ముంబై బ్లాగర్లు అని మెదడు లో  ఒక ఫ్లాష్ మెరిసింది,ఆ ఫ్లాష్ లైట్ నేరుగా 

వెను వెంటనే
నేను:I'm searching for the one which  my friend had recommended
షాప్ కీపర్:ఏంటా నవల్  ?
నేను: మా గూరూజీ  రాఘవేంద్ర రావు కొత్త హీరోయిన్ ది అంటే బాగుండదని
Wind rains of Moon Light (తెలుగు లొ తర్జుమా చేసుకొనుము)
షాప్ కీపర్:ఆథర్ ఎవరు
నేను:రాబిన్ శర్మ 

                                

షాప్ కీపర్:అది లేదండీ సారీ, వేరే ఏదైనా తీసుకోవచ్చుకదా
మళ్ళీ నేను ఆలోచనలో పడ్డా

కొద్ది క్షణాల్లో 
I need "The Guava tree in our backyard" అని అనేసరికి వాడు రెండు వరుస బాలయ్య సినిమాలు చూసిన ప్రేక్షకుడిలా నీరసించిపోయి లేదు సార్  అని జాలిగా అన్నాడు

వాడి మైండ్ బ్లాక్ అయిపోవడం తో
నాకు వచ్చేవారానికి ఈ రెండు పుస్తకాలు కావాలి
ఎందుకంటే  ఖచ్చితంగా ఈ నెలాఖరకు వాటిని చదివితే కాని నిద్ర పట్టదు 
అని చెప్పేసి  జంప్ అయిపోయాను అక్కడ నుండి రాఘవేంద్ర రావు కి మనసు లోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ! 

Monday, November 26, 2012

ఎటుపోతున్నాయి ఈ తెలుగు బ్లాగులు




Yes,I am

కొద్ది రోజుల క్రితం రోజా ప్రోగ్రాం చూడలేక ఈ టీవీ నుండి మాటీవీ కి చానల్ మార్చాను
ఎదో అవార్డ్ ఫంక్షన్ కొంచెం జూమ్ చేసి చూస్తే మా.టీ.వీ అవార్డ్స్ ఫంక్షన్ అట్టహాసం గా జరుగుతోంది
మహేష్,మోహన్,విష్ణువర్ధన్ తదితర బాబులందరూ ఆసీనులయ్యారు 
ఆ సీన్ తిలకిస్తుండగా వేదికపై

http://youtu.be/6RbH3z3PuEQ
ఇది జరిగింది
 ప్రోగ్రాం చూసినంత
సేపు జనాలు ఇంతలా నవ్వలేదు
వాళ్ళ నవ్వులు చూసి నాకు షాక్ కలిగింది

http://harekrishna1.blogspot.in/2012/02/blog-post_13.html

ఈ పోస్ట్ యొక్క సారాంశం రెండు ముక్కల్లో తేల్చేసి క్రెడిట్ వాడెవడో కొట్టేయడం ఎంతవరకూ సమంజసం నాకు మాత్రం ఏడుపు వచ్చింది నా టైముని కాదనుకొని బ్లాగుకి నా మేధాశక్తి ని  సాయశక్తులా బ్లాగు ప్రపంచానికి అంకితం చేస్తే  ఆ పాయింట్ ని మళ్ళీ సినీ ప్రముఖుల ముందు స్టేజ్ మీద ప్రదర్శించి వాడెవడో మార్కులు కొట్టేస్తాడా
ఈ విషయం తెలుసుకున్న
నా పక్కనే ఉన్న మా ఫ్రెండ్ కి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది
ఫ్రెండు:చెప్పు అలీ మీద కేస్ వేద్దామా,రాఘవేంద్ర రావు మీద కేసు వేద్దామా
నేను:వాళ్ళేం  చేసారు
వాడు:మా టీవీ ప్రోగ్రాం డైరెక్టర్ మీద కదా వెయ్యాల్సింది
నేను:అలోచించి చూడు విష్యం అర్ధం అవుతుంది
వాడు:నాకేం అర్ధం కావడం లేదు చెప్పు తప్పు ఎవరిదీ
నేను:రెండు రోజులాగాక నువ్వే చెప్పు

--------------------------------------
రెండ్రోజులు గడిచాక


భూమి పుట్టక ముందు నుండి బ్లాగులు రాస్తున్నావు  తమ తమ స్నేహితులకు బంధువులకు మాత్రమే పత్రికల్లో చోటు కల్పించే పెద్ద మనుషులు నీకొక చాట చూపించి బ్లాగు బస్సులో నిన్నొక మూలకు తోసేసి తోక్కేసారు వాళ్ళను నువ్వు వదలకూడదు.


నేను:అలా ఎందుకనుకుంటున్నావ్,నీ కంటికి నేను సోనూ సూద్ లా కనిపిస్తున్నానా వదల బొమ్మాలీ అని అనడానికి అయినా
కొంత మంది ఎంత అనుష్క రేంజ్ లో కటింగ్ ఇచ్చినా వారంతా నిజంగా హీరోయిన్స్ అనుకుంటున్నావా  

వాడు:లేకపోతే ఎక్కడలేని జాన్ జఫ్ఫా బ్లాగులకే పరిచయం రాసి IITians క్రియేటివిటీ ని కించపరిచి బొంతమీద పరిచినట్టే కదా

నేను:అవి అండర్ రేటెడ్ బ్లాగులు అవ్వచ్చు కదా

వాడు:అలా అని నీకు రావాల్సిన క్రెడిట్ రాకున్నా ఆరు నెలల క్రితం బ్లాగు స్టార్ట్ చేసిన బ్లాగ
ర్లు పత్రిక లో పుంఖాను పుంఖాలుగా కంటెంట్ లేకుండా పిచ్చేక్కిన్చేస్తే ఈ చర్య ను నువ్వేమంటావ్

అయినా నీకేంటి నాయనా ముంబై లో ఉంటావు ప్రకృతి  సౌందర్యాన్ని అస్వాదిస్తావు అనుష్కా మీ బాంద్రా అమ్మాయిల ముందు ఎందుకూ తీసిపోదు.
నేను: The awkward moment the content creator got fewer likes and appreciation than the one who copied

వాడు:అంటే
నేను:the person who copied from your answer sheet got more marks than you

వాడు: Enough of this $ hit that had happened ,c'mon lets play cricket
నేను: Pitch please