Pages

Thursday, May 31, 2012

ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హైన్..



మొన్న పేపర్ చదువుతూ ఇక్కడ ఆగాను...



ఛీ..నా బతుకు!
నేను పదో తరగతి లో క్లాస్ ఫస్ట్ వచ్చినా నా ఫోటో పేపర్ లో వెయ్యలేదు..
ఈ అమ్మాయికి ఏడేళ్ళు కూడా లేవు పేపర్లో హెడ్ తో పాటు హెడ్ లైను..




సరే మనకెందుకు
లే అని youtube ఓపెన్ చేస్తే అసలు వీడియో ఓపెన్ అవ్వకుండా ఈ ad ప్లే అవుతోంది..
వెంటనే నేను ఒక్కసారి నా పదో తరగతి రోజుల్లోకి వెళ్ళాను..

పరీక్షలు రాసేసి సెలవుల్లో  

నేను,Wasim ,Teja మరియు Hemanth (WTH ) నాతో కలసి నలుగురం అందరం మా ఊరికి అయిదు కిలోమీటర్ల దూరం లో కొండ మీద జాతర అవుతుంటే ఎలాగోలా ఉన్న డబ్బులు  పోగేసుకొని వెళ్ళాం.

కాసేపటకి ఎండ తీవ్రత పెరిగిపోవడం తో
చేసేది లేక థామస్ కుక్ ఉప్పేసిన నిమ్మ సోడా తాగుదాం అని డిసైడ్ అయ్యాము ..

మా
తేజ మాత్రం థమ్స్ అప్ తప్ప వేరేది తాగేది లేదు అని మంకు పట్టు పట్టాడు..

రెండొందల మిల్లీ లీటర్లను నలుగురం పంచుకొని కొండ దిగుతుండగా 


హేమంత్:థమ్స్ అప్ తాగాక కిందకు వెళ్ళడం అవమానం మరియు అమానుషం, మనం వెళ్ళాల్సింది towards అప్ నాట్ డౌన్ అని డైలాగ్ వేసాడు.

సరే ఇంకొంచెం పైకి వెళ్దాం అని ఒక అరగంట పైకి నడిచాం..నడిచాక తెలిసింది దాహం పెరిగింది మళ్ళీ థమ్స్ అప్ కి వేళయింది..
అని జేబులు ఖాళీ చేసేసి
ఈ సారి అర లీటరు థమ్స్ అప్ స్వాహా చేస్తుండగా కాసేపటకి..


సర్వం తెలిసినట్టు ఒక వృద్ధుడు మా దగ్గర కూర్చున్నాడు.. బాబూ దాహం అని
అడిగేసరికి మిగిలిన థమ్స్ అప్ అతనికి ఇచ్చేసాం


తను మమ్మల్ని ఆశీర్వదించి వెల్లిపోతుండగా మేము అడిగాము
మా దగ్గర డబ్బులు లేవు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా ఊరు వెళ్లిపోవాలి అని
వెంటనే ఒక అరణ్య మార్గం చూపించి
 
మీ ఊరికి షార్ట్ కట్ ఇదే.. అని వాడు ఫినిష్ చేసే లోపు
నేను మా వాళ్ళకు మార్గదర్శి శ్రీ రామ్ చిట్స్ అవుతూ ఆ  రూట్ వైపు అడుగులు వేసాను...  


నడిచాం,పరుగులు పెట్టాం చివరకి అరణ్యం నుండి హైవే పైకి వచ్చేసాం
అయిదు కిలో మీటర్లను బస్ వేరే ఏ వాహనం వాడకుండా మా ఊరు చేరిపోయాం అని ..






   


నేను విజయ గర్వం తో మా WTH టీమ్ తో చూసారా
తీస్ మినిట్ కా రాస్తా తీన్ మినిట్ కా బనాదియా అని మహేష్ బాబు లా చెప్పాను.


కొంత దూరం నడిచేసరికి
హైవే పైన -
బోర్డ్ లో పెద్ద అక్షరాలతో మా ఊరు దాని క్రింద చిన్న ఫాంట్ లో 12 కిమీ..





ఈ లోపు మా రూమ్ మేట్ 

aqua guard లో నిండిపోయిన నా బాటిల్ వైపు వేలు చూపిస్తూ 

ఔర్ కల్ ?
నేను:కల్ సే పానీ,జ్యూస్ ఔర్ కోక్ కే బినా కోయీ డ్రింక్ నహీ పీయేంగే