Pages

Tuesday, January 3, 2012

Sadda haq


అనగనగా ఆకివీడు సామ్రాజ్యానికి విజయ బాపినీడు చక్రవర్తిగా తన బంగారు కిరీటం చుట్టూ చిన్న చిన్న నిప్పు రవ్వ లైట్లు వేసుకొని ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో...

ఒక రోజు ఏమయ్యిందంటే 

రాజు కి బ్లాగులు అంటే ఏమిటో తెలియక పోవడం వల్ల శత్రువులు లేక,టైం పాస్ కాక విలాసాలకు అలవాటుపడి నాసా లో అంతరిక్ష కధలంటూ నస తో పక్క రాజ్యానికి అతిధి లా వెళ్ళి వాళ్ళకు పట్టపగలే  కుక్కలా అరిచేసి చుక్కలు చూపించేవాడు.

తమ మిత్ర రాజ్యాల్లో ఉన్న మరో రాజు నామధేయం కోడి రాజు .. ఒకానొక ఖర్మ కాలే ఆకలేసిన సమయం లో మన బాపినీడు పాలిట బంపర్ఆఫర్ లా ఓ మారు కోడి రాజు యొక్క ఆతిధ్యం స్వీకరించవలసి వచ్చింది.


కోడి కి పెట్టే తిండి తప్ప వేరే తినని రాజ్యం లో నూకల అంబలి, తౌడు ముద్దల గారెలు తో ఆరోజు రాత్రి భోజనం చేసి ప్రొద్దున్న లేచిన బాపినీడు తనకి బాగా అలవాటైన కోడి తిండి ప్రావీణ్యత ను విచ్చలవిడిగా చూపించాక..


మరుసటి రోజు ప్రొద్దున్న రాత్రి తిన్నది పందెం కోడి తిండి కదా అని అనుమానం వచ్చి వెంటనే తన రాజ్యానికి పయనమయ్యాడు.

వెళ్లేముందు కోడి రాజు ఒక టిఫిన్ బాక్స్ లాంటి దీర్ఘచతురస్రాకార డబ్బాని గిఫ్ట్ పేక్ లో బాపినీడుకిచ్చి సాగనంపాడు.  

చక్రవర్తుల వారు తమ రాజ్యం లో ఆ  డబ్బా తెరిస్తే
 శ్రీ లక్ష్మీ గణపతీ ఫిల్మ్స్ పాతాళం లో మాదాకాలం సినిమా పార్ట్ 1,2,3...27 తమ ప్రత్యేక టీ వీ రూమ్ లో చూసి  రచ్చ రచ్చ గా రక్కేసుకున్నాక!

కొన్నాళ్ళకు తమ ఆస్థాన వైద్యుని కి కబురందించారు..రోజూ జిమ్ కెళ్ళి బొబ్బిలి సింహం లా ఉండే రాజు జబ్బు లేక ఇటు కదలలేక నిద్ర ఎక్కువైపోవడంతో  బొజ్జ పెరిగిన బొబ్బట్టు లా తయారయ్యాడు.

   
బ్లాగులు రాసుకొనే వాడి దగ్గర కామెంట్లు అరువడిగినట్టు ఆ  ఆస్థాన వైద్యుడు ఆ  సినిమా DVD లను రాజును అభ్యర్ధించి తనకివ్వమన్నాడు.

DVD లు భద్రపరుచుకొని వైద్యుడు తన వనమూలికల వైద్యాన్ని తయారుచేసి రాజుకి అందించాక

రాజు వైద్యముందనే ధైర్యం తో పరిచారికలందరినీ తన ఆస్థాన సభలో తన చుట్టూ వృత్తాకారం లో నిల్చోబెట్టి.. 
మన చక్ర వర్తి ఒక చేత్తో మైక్ పట్టుకొని,మరో చేత్తో కొబ్బరి కొమ్మ పైన అతికించిన చీపురు పుల్లలతో చేసిన గూట్లే గిటార్ ని వాయిస్తూ
నృత్య ప్రదర్శన ఇలా మొదలెట్టాడు..

ఇంతలో ఆస్థాన జాకీ మ్యూజిక్ ఆన్ చేసాడు
 

O Eco friendly
Nature ke rakshak
Main bhi hoon nature
Rewazon se..Samajon se..Kyun…….oye..

Sadda హక్ అయితే రక్
Sadda హక్ అయితే రక్

అని వాళ్ళంతా కోరస్ పాడుతుంటే మన  చక్రవర్తి, బాపిన్ మండేలా లా ఒక తేజస్సు తో చుట్టూ  ఉన్న అందర్నీ రక్కేయడం మొదలెట్టాడు..
డాన్స్ అయిపోయాక రక్కించుకున్న అందరికీ ఒక రాగి నాణెం తో పాటు రక్కోమాస్ repellent క్రీమ్ రెండొందల గ్రాముల ట్యూబు లు ఇచ్చేసి రాజు అందరినీ ఇంటికి పంపించేస్తుండగా..

ఆస్థాన జాకీ
రాజు దగ్గర కమీషన్ కొట్టేద్దామని.. What a performance! అహో ఓహో అని చెప్పి రాజుని స్టేజ్ మీద కు తీసుకెళ్ళి ఘాట్టిగా తనతో మళ్ళీ పాడమని మొహమాట పెడితే...

రాజు: Sadda హక్ అయితే రక్
పరిచారికలందరూ: చేతిలో పెట్టిన రాగి నాణాన్ని చూస్తూ  బుధవారం గురువారం శుక్రవారం (WTF)   అని మూకుమ్మడిగా అరవడం తో సభ ముగిసింది.


 

11 comments:

Anonymous said...

హహ్హహ్హా... బావుంది.
అసలేంటి ఆ పద ప్రయోగాలు... బాబోయ్.య్..య్..య్
**కిరీటం చుట్టూ చిన్న చిన్న నిప్పు రవ్వ లైట్లు వేసుకొని ఒక వెలుగు వెలుగుతున్న
**పాతాళం లో మాదాకాలం, బొజ్జ పెరిగిన బొబ్బట్టులా, బ్లాగులు రాసుకొనే వాడి దగ్గర కామెంట్లు అరువడిగినట్టు..
అసలు యిలాంటి ideas ఎలా వస్తాయి మీకు??
పాటకి whistles :))

రాజ్ కుమార్ said...

బుధవారం గురువారం శుక్రవారం...
అన్నన్నా.. తప్పుకదూ... :) (అర్ధం కావడానికి ఐదు నిమిషాలు పట్టింది)

వేణూశ్రీకాంత్ said...

హహహ సూపర్ హరే :-))
హిహిహి బుధగురుశుక్ర సూపరు.. అన్నట్లు నువ్ చెప్పేది Welcome To Facebook అనేగా ;-P

Niftysiri said...

Advertising:
NIFTY OPTION TIPS
We are only providing accurate niftyoption tips with contract notes proof.
Come join with us. NIFTYSIRI.IN

హరే కృష్ణ said...

బిట్టు :))
థాంక్యూ వెరీ మచ్ :)
ఐడియాలు అంటే ఐడియా నెట్ వర్క్ లు వాడకుండా బొబ్బట్లు తింటూ ఉండాలి :)

రాజ్ :))
హహ :P
థాంక్యూ :)

వేణూ గారు చాలా థాంక్స్ :)
Welcome to Facebook :))
yes అదే అదే :P

తెలుగు బ్లాగు లలో హింగ్లీష్ టైటిళ్ళు పెడితే ఏమవుతుందో ఈరోజు తెలుసుకున్నాను :P

శశి కళ said...

ఆండీ...యెమిటిది....బాబొయ్....యెమి పదాలు...నాకైతె ముక్క అర్దం కలెదు...కాని చదువుతుంటె పిచ్చ....)))))వచ్చింది

మధురవాణి said...

వామ్మో... నిప్పురవ్వ లైట్లు, తౌడు ముద్దల గారెలు, పాతాళంలో మాదాకాలం, బొజ్జ పెరిగిన బొబ్బట్టు, బుధవారం గురువారం శుక్రవారమా........ కెవ్వ్ వ్వ్ వ్వ్... అసలీ అయిడియాలు ఎలా వస్తున్నాయి బాబూ నీకు? నీ క్రియేటివిటీకి హద్దూ పద్దూ లేకుండా పోతోందీ మధ్య! :)))))))))

Rambabu said...

మీ ఈ కథతో జంధ్యాల మరియు వారి జట్టును గుర్తు చేసినారు. ముఖ్యులు సుత్తి వీరబధర్రావు గారు.....

హరే కృష్ణ said...

శశి గారు :)))
పిచ్చి పీక్ కి వెళ్ళిపోయింది :P

మధుర..చాలా చాలా థాంక్స్!
ఏముంది ..పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇస్ ది సేఎక్రెత్ ఆఫ్ బ్లాగ్ energy అంతే :)

రాంబాబు గారు థాంక్స్ :)
అంత బుర్ర తినేసానా :)

Ennela said...

yedo porapatuna ikkadikochchi , yee break-fast story ki balayi poyaa....budhavaaram, guruvaaram, friday...okka mukka arthamayithe oTTu..ayinaa yenduko tega navvochindi..
andy chaturulu naaku yeppatiki artham avuthaayani! antaa pai vaadi leela!

Ennela said...

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
reply please