Pages

Wednesday, June 22, 2011

రెట్రో రుమాంటిక్





చిన్నతనం నుండి ఇంటిదగ్గరే పెరిగి నూట యాభై కిలోమీటర్ల దగ్గర లో ఉన్న సిటీ లో మంచి సీట్ వచ్చినా ఇంటిని వదిలి వెళ్ళాలి అన్న ఒకే ఒక ఉద్దేశ్యం తో తమ ఊర్లోనే ఇంజనీరింగ్ చదివి తమ ఊరే లోకంగా పెరిగిన అంతరిక్ష్ ఉద్యోగం కోసం బోంబే వెళ్ళక తప్పలేదు..



కాలేజ్ లో హిందీ క్లబ్ లో చురుగ్గా ఉండడం చేత బాష వల్ల ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నప్పటికీ.. ఇంటి దగ్గర ఉండడం లేదు అనే బాధ.. అమ్మా,నాన్నలను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువై జాబ్ లో చేరిన కొద్ది రోజులకే అంతరిక్ష్ కి ప్రశాంతత కరువయింది

.ఇంటికి తరచుగా వెళ్ళి వస్తున్నా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆవహించి The city Never sleeps లో నిద్ర కరువై రోజు రోజుకి frustration పెరిగిపోతోంది

చాలా మంది స్నేహితులు బంధువులు ఉన్నా కూడా ఎవరి బిజీ జీవితాల్లో వాళ్ళు తల మునకలై ఉండటంతో బోంబే అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అందరూ ఉన్నారు మరేం ఫర్వాలేదు అని ఎంతో ఊహించుకున్న అంతరిక్ష్ కి నిజంగానే మొదటి ఆరు నెలలు అంతరిక్షం కనిపించింది..

అదే వారం రేస్ సినిమా టీవీ లో టెలికాస్ట్ చేసాడు..అంతరిక్ష్ కి తన రేస్ మొదలయ్యిందని తెలుసుకోవడానికి ఎన్నోరోజులు పట్టలేదు

ఎప్పటి లానే లోకల్ ఎక్కి కూర్చోడానికి చోటు లేక కాస్త వెనుక నిల్చొని linkin park వింటూ వింటూ తల ముందుకి వెనుకకి ఆడిస్తూ తనని తానే మరచిపోయి వెనుక ఉన్న అమ్మాయి తల ని అసంకల్పితంగా ఢీకొని తనకి సారీ చెప్పాక ఐపాడ్ తీసేసి పేపర్ చదవడం మొదలెట్టాక

తను మాత్రం తన ఫ్రెండ్ తో ఐ లవ్ అతిఫ్..what a beauty this song has been అని pehli najar mein పాట ని తన ఫ్రెండ్ తో పాటు గట్టిగా హమ్ చేయడం మొదలెట్టాక..తన ఫ్రెండ్ you know my all time favorite will be kya mujhe pyaar hai అంతరిక్ష్ గట్టిగా $#!^@ అని అరిచాక...


అమ్మాయి:hello, what you have been said to me
అంతరిక్ష్: $#!^@
అమ్మాయి:mind your words
అంతరిక్ష్ వెంటనే తన మొబైల్ లో నెట్ ఓపెన్ చేసి ఇక్కడ మరియు ఇది కూడా వీక్షింప చేసాక

ఓహ్ $#!^@ అని వాళ్ళిద్దరూ కూడా కోరస్ పాడి గట్టిగా నవ్వేసారు .. ఒక రెండు నెలలు అదే ట్రైన్ ఒకే టైం లో ఒకే ప్లేస్ లో అవే సన్నని స్మైలీలతో సాగుతున్న జీవితం లో

అంతరిక్ష్ బర్త్డే కి రుమా మరియు తన ఫ్రెండ్ కి ట్రైన్ లో స్వీట్ ఆఫర్ చేయడం తో ..హే పార్టీ మరి అని అడిగాక సాయింత్రం ముగ్గురూ కాఫీ డే కి వెళ్ళి తమ స్నేహ ప్రయాణం ఒక కాఫీ టేస్ట్ లాంటి అనుభూతిని మొదటి సారిగా పొంది ఒక చిన్న get together చేసుకొని ఈ లైఫ్ కి కాస్త అలవాటయ్యాక అంతరిక్ష్ రుమా పరిచయం లో అంతరిక్ష్ చాలా హ్యాపీ గా ఉన్నాడు.


santacruz నుండి అంధేరీ ఇద్దరూ ఒకే లోకల్ లో కలసి వెళ్ళడం నుండి ఒకే కంపార్ట్మెంట్ లో పక్క ప్రక్కన కూర్చునే అంత సన్నిహిత్వం ఏర్పడింది ఇద్దరికీ

ఎప్పటిలానే తన క్యూబికల్ లో కూర్చొని ఈవినింగ్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి చూస్తే తన కోసం రుమా వైట్ చేస్తోంది..

ఈరోజు తొందరగా వచ్చేస్తా అని చెప్పావ్ కదా పొద్దున్న ..lets go and have some fun అని చెప్పి తమ కామన్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారు .. పన్నెండు తర్వాత మెరైన్ డ్రైవ్ లో తనతో గడిపిన ఆ క్షణాలు అంతరిక్ష్ ఆనందానికి అవధులు లేకుండా చేసాయి



నెల కు రెండు సార్లు ఇంటికి వెళ్ళే అంతరిక్ష్ ఇప్పుడు రెండు నెలలకి ఒకసారి కూడా వెళ్ళడం లేదు

రెండేళ్ళు గడిచాయి గడిచాక రుమా కి చర్చి గేట్ ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోయింది ..తమ పేరెంట్స్ కూడా బోంబే వచ్చేయడం తో ఫోన్స్ చేస్తూ ఉన్నా అంతరిక్ష్ , రుమా వీక్ ఎండ్స్ లో కూడా కలవడం కుదరడం లేదు..

ఒకరోజు ధైర్యం చేసి రుమా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంతరిక్ష్

కాలింగ్ బెల్ కొట్టగానే తన యాభై లలో ఉన్న క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న వ్యక్తి తలుపు తీసాడు
ఎవరు మీరు ఏం కావాలి
నేను రుమా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను
రండి హాల్ లో కూర్చోండి
నేను రెండు మూడు సార్లు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసారు నా వాయిస్ గుర్తు పట్టలేదా లాంటి ప్రశ్న లన్నీ అడిగి మంచి నీళ్ళు తాగుతున్నాడు
అంతరిక్ష్ హాల్ లో బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నా లోలోపల తను మాత్రం చాలా నెర్వస్ గా ఉన్నాడు

where is ruma?అని అడగడం తో
కాసేపయ్యాక రుమా వల్ల నాన్న తో అంతరిక్ష్ చెప్పేసాడు మీ అమ్మాయి అంటే నాకిష్టం అని
ఇంతలో అంతరిక్ష్ చెంప చెల్లు మంది
దీనర్ధం ఇంకా ఉంది :)

Tuesday, June 14, 2011

సంధ్యమ్మా స్వీట్ పెడతా...



మే 20 ,2008
రూమ్ నెంబర్ 513
హాస్టల్ 12
5th floor
ఐ.ఐ.టి బోంబే

ప్రొద్దున్న 7 .50 కి దున్న లా ఒక ఓండ్ర పెట్టి ఆ తర్వాత పెద్దగా ఆవులించి..ఆపైన లిఫ్ట్ పనిచేయకపోవడం తో పరిగెత్తుకుంటూ బేస్ మెంట్ కి చేరుకొని బేగ్ లో ఉన్న మౌత్ ఫ్రెష్ నర్ తీసి ఎనిమిదింటికి జరగాల్సిన క్లాస్ కోసం సైకిల్ మీద స్టార్ అయ్యాడు మిలింద్.



మిలింద్ క్లాస్ లో చేరుకొనే సరికి ప్రొఫ్ క్లాస్ స్టార్ట్ చేసేసాడు...సెంటర్ బెంచ్ లో ఉన్న నేహ ప్రక్కన కూర్చొని క్లాస్ వింటూ తన చేతిలో ఒక సెంటర్ ఫ్రెష్ పెట్టాడు..


క్లాస్ అయిపోయాక
నేహ:ఏంటి లేట్ అయ్యింది ..
మిలింద్: ఏం లేదు, ఎప్పటిలానే టైం కి లేచి సైకిల్ తీశాను టైర్ లో గాలి లేదు... పంక్చర్ అనుకుంటా..అసలే భూమి కి భారం గా తయారవుతున్నావ్ అని మీ హాస్టల్ లో ఇద్దరు అమ్మాయిలు అన్నారు తెలుసా ?

నేహ:నీ లవర్ భూమి తో తిరిగితే నువ్వు ఆకాశానికి భారం అవుతావా చెప్పు ? ఐ క్వొచ్చన్..తూ గైడ్ కమ్ బాంక్
మిలింద్: విక్రమ్ నా? VGS ఆ ?
నేహ: ఎక్కువ చేస్తే నేను చాచి ఒకటి ఇచ్చెదన్
మిలింద్: అయినా సంధ్య నా ఫ్రెండ్ మాత్రమే కదా ...అంటే.. యూ మీన్ ?
నేహ:నేను ప్రశ్న వేసాక నాకే ప్రతి ప్రశ్న వేస్తే నీ పాలిట గొంతు పచ్చలారని నీ ప్రత్తి పంట లాంటి జీవితం లో చీడపురుగునవుతా అని ఒక బాల డైలాగ్ కొట్టి అక్కడ నుండి నిష్క్రమించాక



హాస్టల్ లో వార్డెన్ నిన్ను పిలుస్తున్నాడు అని మిలింద్ ఫ్రెండ్ నుండి ఫోన్ రావడం తో వెళ్ళిన మిలింద్..వార్డెన్ ముందు కూర్చున్న వివేక్ ని చూసి వీడు నా మీద కంప్లైంట్ చేసాడా ఇటువంటి బహుముఖ ఎక్స్ప్రెషన్లతో అనంతమైన ఆలోచనలతో వార్డెన్ ముందు నిలుచున్నాడు.


వార్డెన్: కూర్చో మిలింద్..నా గురించి నీకు తెలుసు కదా
నేను పేరుకి మాత్రమే వార్డెన్ ని.. తేడా వస్తే నా upgraded వెర్షన్ War Don 2.0 ని చూసి దానితో ఆడుకునే శక్తి మీకెవ్వరికీ లేదు.
మిలింద్:వైరస్ లతో రిలీజ్ చేస్తారా
వార్డెన్: ఉహు
వివేక్:అలా అయితే నువ్వే ఆడుకో,లాన్ లో బోల్డు గేమ్ లు ఉన్నాయ్..షూమేకర్ అంటే చెప్పులు తయారు చేసే బాటా కంపనీ వాడి తమ్ముడనుకొనే మొహం వేసుకొని.. ముందు విషయం చెప్పు

వార్డెన్: నేను ఈ హాస్టల్ కి వార్డెన్ ని ఆ విషయం మర్చిపోయి మీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించొద్దు.
మిలింద్:ఏయ్.. వార్ డానూ...డ్రాగన్ మొహం వేసుకొని..రాడన్ టెలీ ఫిలిం లా నీ నస ఆపరా బాబూ..మా కంప్యూటర్ బ్రెయిన్ లకు పట్టిన ట్రోజన్ లా దాపురించావు.


వార్డెన్:come to the point ..i want to know what had happened yesterday night
మిలింద్:nope,whats up ?..i think మీ ఇంట్లో స్టీల్ సామాన్లు అరిగి పోయుంటాయ్.. హాస్టల్ మెస్ లో ప్లేట్లు,కంచాలు స్పూన్ల మీద నీ దండయాత్ర మొదలెట్టి ఉంటావ్ అంతే కదా..am i right ?
వార్డెన్: స్టాప్
మిలింద్: సూపర్ టైమింగ్,ట్రాఫిక్ పోలీస్ కి సరిగ్గా సరిపోతావ్..
వార్డెన్: ఆపరా..
మిలింద్: ఏంటి కారా ?
వార్డెన్: కాదు సైకిల్
మిలింద్: క్యో



నిన్న రాత్రి పన్నెండింటికి ఏం చేసావ్ అని అడిగేది నిన్నే... సమాధానం చెప్పవేం ?నిన్న రాత్రి ఏం చేసావ్... నీ కంటి కి మా ఇద్దరం ఎలా కనిపిస్తున్నాం...
మిలింద్:dumb and dumber

(కాసేపు రూమ్ లో నిశ్శబ్దం )

సినిమా చూసాను.


వార్డెన్ కి కోపం కట్టలు తెంచుకొని ఖరీదైన బాణం బట్టలను చించలేక పెప్సోడెంట్ పళ్ళను కొరుకుతూ కంట్రోల్ చేసుకొని
నిన్న రాత్రి ఈ వివేక్ నీ సైకిల్ టైర్ లో గాలి తీసేసాడు అని నీకు చెప్దామనుకుంటే నువ్వు వాడి ఎదురుగా నా గాలి తీసేస్తావా.. అని కయ్ కయ్ అంటూ గయ్య్ మన్నాడు



వార్డెన్ రూమ్ నుండి బయటకు వచ్చాక వివేక్ ని నిలదీసాడు మిలింద్ నీ వల్ల ఈ రోజు ఫస్ట్ లెక్చర్ మిస్ అయ్యేవాడిని తెలుసా..ఎందుకు చేసావ్ చెప్పు

ముందు రోజు నీ ముందు టైర్ ని తీసేసి పాడయిపోయిన వేరే టైర్ వేసిన ప్రతీక్ ని మాత్రం అనకుండా నన్ను నానా పటేకర్ మాటలు వల్ల నేను హర్ట్ అయ్యాను ..

వివేక్:నువ్వు కాస్త మీ క్లాస్ అమ్మాయిలతో తిరగడం తగ్గించుకో..కాస్త పైకోస్తావ్..చీమ కుడితే చర్మానికి గమాక్సిన్ పూసుకొనే తెలివితేటలు నా దగ్గర ఉపయోగించ్చొద్దు.

మిలింద్:నన్ను తిట్టినప్పుడు నన్ను కేవలం నన్ను మాత్రమే తిట్టాలి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చావో నీ సైకిల్ లో గాలి ఉండదు

వివేక్: అందుకే చెప్పాను ఆ బ్లాంక్ బుర్ర బాలికలతో తిరగడం మానుకోరా అని .. నాకు సైకిలే లేదు..ఫో..నీ చిన్న మెదడు ని చిన్ని కృష్ణ తినెయ్యా..

మిలింద్: $%^$^$*%*@(*^%..నువ్వే పోరా.. నీ థీసిస్ ని రోడీస్ రఘురామ్ రివ్యూ చెయ్యా.



సరే నీ పని నే తర్వాత చెబుతా టైం పన్నెండు కావస్తోంది ప్రొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా ఏం తినలేదు.. నేహా ప్రతి రోజూ ఏదో ఒకటి తీసుకోచ్చేది వాళ్ళ హాస్టల్ నుండి.. ఒక్కోసారి అదేంటో నాకంటే నేహంటేనే ఇష్టం అనిపిస్తూ ఉంటుంది

సడెన్ గా ఈ వార్డెన్ నుండి కాల్ వచ్చేసరికి ఈరోజు ఆ భాగ్యం కూడా లేదు అని నిట్టూరుస్తూ మెస్ కి వెళ్ళాడు మిలింద్.

*****************************************************************************************************
నేహా ఫోన్ చేసి.. ఆ రోజు రాత్రి డిన్నర్ కి మిలింద్ తో పాటు మరి కొంత మంది ఫ్రెండ్స్ ని invite చేసాక అక్కడే ముభావంగా కూర్చొన్న సంధ్యా భూమీ aka సంధ్య ని చూసి

మిలింద్: బ్లాగులో కొత్త ఫాలోవర్లు చేరడం లేదన్నంత లెవెల్ లో అంత దీనంగా మొహం పెట్టావ్.. ఏమైంది ?
సంధ్య:మా నాన్న నా పెళ్లి చూపులు మొదలెట్టేసాడు మిలింద్..నాకేం చెయ్యాలో తెలియడం లేదు

మిలింద్:మరి,నువ్వు ఎవర్నైనా ఇష్ట పడ్డావా ?
సంధ్య:హా..మన క్లాస్ లో సెకండ్ టాపర్ ని..

మిలింద్: మరి తనకి చెప్పేయొచ్చు కదా నీ ప్రేమ విషయం
సంధ్య: వాడి కి క్రిస్టల్ క్లారిటీ లేదు అదే నా బాధ

అని చెప్పి తిని రూమ్ కి వచ్చి నిద్రపోయి ఆ మరుసటి రోజు ఉదయం సెకండ్ టాపర్ నేనే కదా అని మిలింద్ కి బల్బ్ వెలిగింది


అద్దం లో...
ఛీ ఛీ పోస్టులను గూగుల్ రీడర్ లో చదివి కామెంట్లకు గండి కొట్టే నీ లాంటి వాళ్ళ వల్లేరా..ఆ ఎల్లోరా ఎనిమిదో వింత కాకుండా పోయి నా లాంటి వాళ్లకు సరైన ప్రోత్సాహం లేక నా బుర్ర మందగించి వెనుకబడిపోయింది.. అని తనలో తననే తిట్టుకుంటూ సంధ్య ని కలవడానికి లైబ్రరీ దగ్గర నేస్కాఫేకి వెళ్ళాడు .

nescafe బయట
మిలింద్: ఐ లవ్ యూ.. సంధ్యా!
సంధ్య: నీ మేధాశక్తి ని మహా సిమెంట్ లో కప్పెట్ట
అది సరే కానీ నువ్వు నేహ ని లవ్ చేస్తున్నావ్ కదా..ఇప్పుడు ఎలా

అది అంతే సంధ్య..నీ మీద ఉన్నది నా నిజమైన ప్రేమ..అది నువ్వు నమ్మాలి
తను ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం ఒక గొప్ప అదృష్టం అని ఓ ఎమోషీ కామోషీ డైలాగ్ చెప్పాక
సంధ్య మురిసి పోతూ ముస్యో నవ్విన్గ్స్

మిలింద్:నువ్వు లేకుండా నేను బతకలేను..ఇది నిజం
సంధ్య:మరి నేహా కి ... నువ్వు దక్కకపోతే తను ఎలా బతుకుతుంది
మిలింద్:పిచ్చి సంధ్య..ఇది కూడా తెలీదా.. ఆక్సిజన్ తో



సంధ్య: నేను కన్విన్స్ కావడం లేదు..ఎందుకంటే జష్టిఫికేషన్ సరిపోలేదు ..

మిలింద్ బొమ్మరిల్లు సినిమా చూసి చాలా కాలం అయిపోయింది..ఇప్పుడు ఏం చెప్పాలా అని చించి తాను మాత్రమే తీయగలిగే దిమ్మ దొర్లు సినిమా క్లైమాక్స్ మొదలు పెట్టాడు

చూడు సంధ్యా

నేహా పోహా లాంటిది.. చూడ్డానికి తెల్లగా ఉంటుంది... అది పంచదార తో తింటేనే బావుంటుంది

గొడ్డు కారం తిని పెరిగిన శరీరం ఇది..పంచదార ని మిక్స్ చేసుకొని తినడం నా వల్ల కాదు తనకి సరిపడా ఏ పుల్లా రెడ్డో వచ్చి తన జీవితాన్ని స్వగృహా ఫుడ్స్ లా పరిపూర్ణం చేస్తాడు అని చెప్పేయడం తో కధ కంచికి చేరుకొని మనం కామెంట్ బాక్స్ దగ్గరకు చేరుకోవడమైనది.

Wednesday, June 8, 2011

పాండు రంగ మహత్యం..

ఈ క్రియేటివిటీ కి జోహార్లు... తప్పక డవున్ లోడ్ చేసుకోవాల్సిన వీడియో :)
ROFL



leave a response in the comment section of the youtube if you like it.

Sunday, June 5, 2011

బ్లాగోకేసుకుందాం రా..





ప్రదేశం: ఉప్పల్ గ్రౌండ్ హబ్, హైదరాబాద్
హర్ష ధ్వానాలు, చప్పట్లతో మారుమోగుపోతున్న సభా ప్రదేశం
తన పోస్ట్ రెండు వందల వ రోజు పురస్కరించుకొని హీరో తన రెండో బ్లాగ్ ని అందరి ముందు లాంచ్ చేసి ప్రముఖ దర్శకుడి తో మొదట కామెంట్ ను రాయించుకున్నాక
లౌడ్ స్పీకర్ ఆన్ చేసి


బ్లాగీ వుడ్ ప్రేక్షకులకు నమస్కారం
ఈ విజయం అందరిది కాదు.. దీనికి ముందు జరిగిన సంఘటన మీ అందరి ముందు తో పంచుకోవాలి అని చెప్పి




నేను ముందు మా నిర్మాత గారికి ఫోన్ చేసి ఈ టైటిల్ చెప్పి
సార్ ఒక కధ అనుకుంటున్నాం..చేస్తే మీతోనే చెయ్యాలి అని చెప్పాక
ప్రొడ్యూసర్ : ఏం, వేరే ఎవరూ దొరకలేదా..
రైటర్ : (నవ్వుతూ)..ఐ లైక్ యూ

ప్రొ :టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉంది
సరే ఈ కధ ఏంటి.. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా దీనికి ?
హా ఎందుకు లేదు..

1 .దురద పుట్టిన చోటే గోక్కోవాలి
2 .దురద పుట్టినపుడే గోక్కోవాలి
3 .గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది అని అన్నాడో మహా బ్లాకవి

అని చెప్పి ముగించి.. సరే దర్శకుడు ఎవరు,హీరో ని ఎవర్ని పెట్టుకుందాం అని అడిగాక

ఇంకెవరు సార్..

స్వేద సౌధం తో అరగ్రేటం చేసి
స్క్రబ్బరిల్లు తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై
మండే చుండ్రుడు తో మాస్ ఎనర్జీ ని ట్రాన్స్ ఫారం ని కోళ్ళ ఫారం చేసేసి
బోరో ప్లస్ శ్రీను దర్శకత్వం లో యంగ్ ఫిరంగీ ఘొళ్ళు దుర్జన్ నటించ బోవు ఈ సినిమా న బ్లాగో న భవిషత్ అన్న రీతిలో ఉంటుంది మన బ్లాగోకేసుకుందాం రా.. దీన్నే
హిందీ లో
rub నే బనాదీ దురద...గా విడుదల చేసేద్దాం అని చెప్పాక

ఓహో..బావుంది బావుంది

హీరో ఎలా ఉంటాడు మన కధ లో..ఆల్ రౌండర్ ఆ ?

వినండి అని చెప్పి మొదటి సీన్ వైజాగ్ బీచ్ లో


వర్క్ ని అటకే ఎక్కిస్తే..ఓ పనైపోతుంది బాబు
బ్లాగులో సెగలే సృష్టిస్తే... ఓ పనైపోతుంది బాబు
కామెంట్లకు కౌంటర్ పడుతుంటే ...ఓ పనైపోతుంది బాబు
ఆ కౌంటర్ ని ఎన్ కౌంటర్ చేస్తుంటే .. ఓ పనైపోతుంది బాబు
ఆ దెబ్బకు చుండ్రే వచ్చేస్తే ..నీ బూడిద బుర్ర ను గోకేస్తే.. ఓ పనైపోతుంది బాబు..ఓ పనైపోతుంది బాబు (ఓ..పా,,బా)

అని జాలీ జాలీ గా దొరికిన జనాల బుర్రలు తినేసి పనిలో పనిగా గోకేసి హీరొయిన్ కి ఫోన్ చేస్తాడు...అయినా వెనుక కోరస్ వాళ్ళు ఓ.పా.బా అని ఆపకపోవడం తో

హీరొయిన్ :ఓ పాపా బాబు ..బ్లాగుకే బాబు
కామెంటరా... తిన్నగా.. తెలుగులో..

హీరోయిన్ హర్రర్ మాటలతో భయపడిన హీరో ఒక షాంపూ బాటిల్ కొనుక్కొని ఇంటికోస్తాడు
తలకు స్నానం చేసి హీరొయిన్ ఇంటికి వెళ్ళిన హీరో


హీరొయిన్ కుటుంబ సభ్యులను తన చుండ్రు కళ్ళతో స్కాన్ చేసి
వాళ్ళ అన్నయ్య ముందు కుర్చీ లో కూర్చుంటాడు

హీరోయిన్ అన్న : ఏం బాబూ ఇలా వచ్చావ్
హీరో :(బుర్ర గోక్కుంటూ ) ఏం గోకననుకున్నావా..గోకలేననుకున్నావా

నువ్వేనా మా చెల్లి చెప్పిన అబ్బాయివి ఏం చేస్తుంటావ్.. లాంటి వివరాలన్నీ అడిగేసాక చివర్లో

హీరోయిన్ అన్న: తల తెల్లగా ఉంది
హీరో:అది హెడ్ అండ్ షోల్డర్స్ వాడాక వచ్చిన తెలుపు కదా మరి

హీరొయిన్:అన్నాయ్, ఎలా ఉన్నాడు మీకు కాబోయే బావ
అన్నాయ్:ఆపు నీ అఘోరా ప్రేలాపన.
సల్మాన్ ని సర్ఫ్ ఎక్సెల్ తో తోమినట్టు ఎక్సలెంట్ గా ఉన్నాడు చూడ్డానికి , అయినా నేను మీ పెళ్లిని చేసేది లేదు.
ఏమయ్యింది ? ఎందుకు

మనం తర తరాలుగా తారలు వాడే మీరా షాంపూ నే వాడుతున్నాం. వీడు తలకు మాసిన వాడిలా ఆ తల మరియు భుజాల షాంపూ వాడుతున్నాడు... భందించండి రా వీడిని అని చెప్పి, హీరో ని కొట్టి అవుట్ హౌస్ లో పడేసాక

హీరోయిన్ అన్న తనకు పట్టిన బూజులు దులుపుకొని, తన అనుచరులతో ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ..


అసలే మీ అక్క వాడెవడో క్లినిక్ ఆల్ క్లియర్ గాడితో వెళ్ళిపోయి మనతో సంభందాలను క్లియర్ చేసేసి మన ఇంటిని క్లినిక్ ని చేసి పడేసింది.నువ్వు కూడా అలా చెయ్యడం నాకిష్టం లేదు.

హీరొయిన్:అన్నయ్య అంతేనా వా ఆ ఆ ..అని ఏడుచుకుంటూ అందరి హీరోయిన్ల లాగానే ఫాస్ట్ గా మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తన గది తలుపులు మూసేసుకొని మంచం మీద పడిపోయి తన బెడ్ షీట్ ని రెండు ముక్కలుగా నిలువునా చీరేస్తుంది...

అప్పుడే తెరపై బ్రేక్ అని చిరిగిన బెడ్ షీట్ మధ్యలో పడుతుంది. .

నిర్మాత : ఓహ్ అదేంటి రెండు గంటల తర్వాత బ్రేక్ ఆ... ఇదేం విరామం లేదు నేను ఒప్పుకోవడం లేదు
సరే అని చెప్పి...ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పు


వెంటనే హీరొయిన్ తన రూమ్ లో చిరిగి పోయిన దుప్పటి ని కుట్టుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది..హీరో ని కలవడానికి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ కొల్లేరు సరస్సు లో కొట్టుకుపోతాయ్..హీరొయిన్ అన్న మాత్రం తమ చెల్లి కోసం matrimony సైట్స్ లో రిజిస్టర్ చేసి తను మాత్రం ఫేస్ బుక్ ఫార్మ్ విల్లే లో కాలం గడుపుతూ ఉంటాడు.


హీరో మాత్రం ఆ గేదెల శాల లో చిన్న చిన్న చైనా ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.




అయితే హీరో,హీరొయిన్ ల ప్రేమ గార్నియేర్ షాంపూ తో వాడిన జుట్టంత దృఢంగా ఉండడంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాడే మీరా షాంపూ బాటిల్ లో హేడ్ అండ్ షోల్డర్ షాంపూ ని కొద్ది కొద్దిగా రోజూ కలిపేసి విష కన్య లా హేడ్ షోల్డర్ హీరోయిన్ అన్య గా తయారు చేసి పారేసాక ఒక రోజు

ఇక్కడ మీ అమ్మమ్మ కి సీరియస్ గా ఉంది రా అని సడెన్ గా ఫోన్ రావడం తో వేరే గ్రామానికి వెళ్ళిన
హీరొయిన్ వాళ్ళ అన్న..బంధువులను పరామర్శించి ఆ ఊర్లో ఉన్న మీరా షాంపూ వాడాక, ఇదేమిటి మీరా వాడు క్వాలిటీ తగ్గించేసాడా బోరు నీళ్ళ వల్ల వచ్చిన ఎఫెక్టా అని బుర్ర గోక్కొని సగం జుట్టు వచ్చేసాక తర తరాల షాంపూ మీద మమకారాన్ని వదులుకొని

తల మరియు భుజాలు దిద్దిన కాపురం లా హీరొయిన్ అన్న భుజాలు ఎగరేసుకుంటూ ఇద్దరికీ పెళ్లి చేసేయడం తో కధ ముగుస్తుంది.



ఇప్పుడు బ్యాక్ టూ టాప్ కి వచ్చేస్తే
విజయోత్సవ సభలో దీనికి సీక్వెల్ తలంటుకుందాం రా..కి మొదటి క్లాప్ ఇచ్చి ఉప్పల్ గ్రౌండ్ లో షూటింగ్ మొదలుపెట్టడం తో ఈ అంకం సమాప్తం.


ఉపోద్ఘాతం :
ఫ్రెండ్ నుండి ఫోన్ మొన్ననే
హాయ్ హరే ఎలా ఉన్నావ్
నీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ వేసావా..బజ్ లో ఏంటి సంగతులు..ఈ వేసవి లో ఏంటి విశేషాలు,

వేసవి లో చుండ్రు శాతం పెరుగుతుంది..
బ్లాగుల్లో కామెంట్ల శాతం తగ్గింది.
బజ్జు అనేది ఒక స్ట్రాబెర్రీ గుజ్జు లాంటిది ..ఒక్క సారి లోపలి వెళ్ళాక ఇంకా ఇంకా టేస్ట్ చెయ్యాలనిపిస్తుంది..అని చెప్పి ముగించి

ఈ చుండ్రు మీద కాన్సెన్ట్రేట్ చేస్తే వచ్చిన అవుట్ పుట్ నే ఈ టపా