Pages

Wednesday, April 6, 2011

అన్వేషణ


41st   floor
పెట్రోనాస్ టవర్స్
మలేషియా

అన్వేష్ తన ఆఫీస్ మార్నింగ్ session ముగించుకొని లంచ్ టైం లో స్కై  బ్రిడ్జి మీదకు వచ్చాడు
Tower 2 నుండి తనవైపే వస్తున్న ప్రతీక్ ని చూసి ఇతన్ని ఎక్కడో చూసానే అని అనుకుంటూ భోజనం చేసేసి మళ్ళీ తన ఆఫీస్ లోనికి వెళ్ళాడు

మధ్యాహ్నం అన్వేష్ ఇంటర్వ్యూ లను చేస్తూ  కాసేపయ్యాక  తన ముందు కూర్చున్న  ప్రతీక్ ని చూసి తన తో కాసేపు  మాట్లాడాక తన resume ని చూసి అన్వేష్ కి చెమటలు పట్టి ఊపిరి ఆడకుండా గిల గిలా కొట్టుకొట్టుకొని కళ్ళుతిరిగి పడిపోయాడు

కళ్ళు తెరిచాక చూస్తే ఒక హాస్పిటల్ లో బెడ్ మీద అన్వేష్ ఉన్నాడు తన పక్కనే చైర్ లో ప్రతీక్
ప్రతీక్: ఇప్పుడు ఎలా ఉంది,సడెన్ గా అలా ఎలా పడిపోయావు అక్కడ
అన్వేష్: డాక్టర్! నిజం చెప్పండి  ఇప్పుడు నా దగ్గర ఎన్ని కిడ్నీలు ఉన్నాయి

డాక్టర్: నువ్వు అతనికి చాలా ఋణ పడి ఉన్నావ్,ఆ  విషయం నీకు తెలుసా.అతనే లేక పొతే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కాదు
అన్వేష్:ఎందుకు ఋణ పడి ఉండడం, ఏం జరిగింది
డాక్టర్: నీ ఫీజులన్నీ అతనే పి చేసాడు తెలుసా ముందు ఆ  ఋణం తీర్చేసేయ్ ,మా హాస్పిటల్ లో ఉన్న టెస్టులన్నీ చేయించేసాం ముందు జాగ్రత్త గా 
అన్వేష్: i don't want pay him..i am leaving right now
అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు
------------------------------------------------------------------------------------------
కట్ చేస్తే
పదేళ్ళ క్రితం
వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ Hyd.
అన్వేష్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు సెప్టెంబర్ మొదటి వారం లో ప్రతీక్ తన ఇంజనీరింగ్  ఫస్ట్ ఇయర్ లో చేరడానికి హాస్టల్ కి వచ్చాడు
హాస్టల్ మెస్ నుండి తన రూమ్ కి వెళ్తున్న అన్వేష్, ప్రతీక్ ని చూసి సాయంత్రం ఒకసారి కనిపించు అని చెప్పి తన రూమ్ నెంబర్ చెప్పి క్లాస్ కి వెళ్ళి పోయాడు
-----------------------------------------------------------------------------------------

ఆరోజు సాయంత్రం
tell me about yourself అని అడిగాక అసలే కొత్త కావడం తో భయం భయం గా అన్ని వివరాలు చెబుతూ ఏడుస్తూ ముగించాడు ప్రతీక్ . అన్వేష్ వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి ఇంకా ఏడిపించసాగాడు
ఇవేమీ పట్టించుకోవద్దు అని చెప్పి ప్రతీక్ ని రూమ్ కి పంపించేశాక ప్రతీక్ రూమ్ లో ఇంకా ఏడవసాగాడు
--------------------------------------------------------------------------------------------

ఆ  మరుసటి రోజు సాయంత్రం
హాస్టల్ గ్రౌండ్ లో అందరినీ సమావేశం అవ్వమని వార్డెన్ అందరినీ పిలిచాడు
సాయంత్రం అంతా వచ్చేసారు..సడెన్ గా  ప్రిన్సిపాల్ కార్ లో దిగి
i told you many times ragging is prohibited and you all know that ..
for god sake it should not be done in our ఇన్స్టిట్యూట్.
who is అన్వేష్... అని గట్టిగా అరిచాడు
అన్వేష్ ని  అందరి ముందు పిలిచి చెంప చెల్లుమనిపించాడు 

ప్రతీక్ అంటే ఎవరు ఇక్కడ అని ప్రిన్సిపాల్ పిలిచాక
అందరి ముందు నిల్చున్నాడు ప్రతీక్, tell me Mr .Prateek ఇతనేనా వేరే ఎవరైనా నిన్ను రాగ్ చేసారా
ప్రతీక్:ఇంకో ఇద్దరు  ఉన్నారు సర్.. రూమ్ లో వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు అని చెప్పేసరికి రాగ్ చేసిన వాళ్ళ ఇద్దరు  సైలెంట్ గా ప్లీజ్ ప్లీజ్ అని సైగలతో వేడుకుంటున్నారు ప్రతీక్ ని
----------------------------------------------------------------------------------
ప్రతీక్: ఇతనే ఎక్కువ చేసారు నన్ను రాగింగ్  వేరే వాళ్ళు పెద్దగా ఏమీ అనలేదు
ప్రిన్సిపాల్:పొద్దున్న నువ్వు కంప్లైంట్ బాక్స్ లో ఏమని రాసావు నిన్న సాయంత్రం  సీనియర్లు ముగ్గురు వాళ్ళ  నాకు చాలా మానసిక క్షోభ కలిగింది అని రాసావ్ కదా.వాళ్ళెవరైనా పర్వాలేదు చెప్పు చెప్పు చెప్పు చెప్పకపోతే నువ్వు అబద్ధం చెబుతున్నట్టే కదా

ప్రతీక్:సరే చెబుతాను (సీనియర్స్ గుండెలు ఇంకా వేగంగా కొట్టుకోసాగాయి )
ఏ పేరు చెప్పాలో తెలియలేదు అలోచించి అలోచించి ఆ  ముందు రోజు రాగింగ్ జరిగిన రూమ్ లో ఒక వస్తువు కనిపించింది అది గుర్తొచ్చి
రాజేష్,సురేష్అని నోటి కొచ్చిన పేర్లు చెప్పేసాడు ప్రతీక్
 ప్రిన్సిపాల్ expressions చూసి  అన్వేష్ కి కోపం మరింత గా పెరిగి పోయింది
అన్వేష్,రాజేష్,సురేష్,లకు మూడు నెలలు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ వెంటనే తన  కార్ లో వెళ్ళిపోయాడు

అన్వేష్ రూమ్ లో కనిపించిన వస్తువు  తన టేబుల్ పైన ఉన్న ఫోటో ఫ్రేమ్
మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే
from రాజేష్,సురేష్ అని ఉంది

ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే రాజేష్,సురేష్ ఇద్దరూ వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో 2nd 3rd ఇయర్ చదువుతున్న అన్వేష్ తమ్ముళ్ళు
ఈ సంఘటన జరిగిన పది  రోజులు తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సలింగ్ జరిగింది. ప్రతీక్ వేరే కాలేజ్ కి మారిపోయాడు.

ఇదంతా గుర్తుతెచ్చుకొని అన్వేష్ నిట్టూర్పుతో హాస్పిటల్ నుండి బయటకు నడిచాడు.. 


25వ follower కు ఈ కధ అంకితం :)

19 comments:

Sravya V said...

హ హ పాపం అన్వేష్ :)

రాజ్ కుమార్ said...

కధ అయిపోయిందా?? ఇంకా ఉందా?? ఇంత చిన్నదా??
సీనియర్స్ రాగింగ్, ప్రిన్సిపల్, అందరిముందూ గుర్తుపట్టడం,సస్పెండ్ చెయ్యడమ్.. ఈ సీన్ల్న్నీ మా కాలేజ్ లో జరిగాయి... అంటె ప్రతీ కాలేజ్ లోనూ జరుగుతాయనుకోండీ.. నాకు గుర్తొచ్చాయి..అన్నమాట :) :)

waiting for next part..

karthik said...

ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా??

మనసు పలికే said...

హహ్హహ్హా.. భలే ఉంది హరే.:)
ముగించేసావా..? కాలేజిలో ఫ్లాష్‌బాక్ బాగుంది. మరి ప్రస్తుతం ప్రతీక్ ప్లాన్స్ ఏంటి అన్వేష్ గురించి..? ;)

శివరంజని said...

ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా?? కధ అప్పుడే అయిపోయిందా??

స్నిగ్ధ said...

హరే గారు,ఎలా ఉన్నారు? కథ ముగించేసారా?ఇంకా ఉందా అండి...
త్వరగా తరువాతి భాగం రాయండి..

హరే కృష్ణ said...

శ్రావ్య :)
అంకితం కాస్త రాజశేఖర్ కెరీర్ లా అయిపోయింది :)
విజయవాడ పోస్ట్ వేసేస్తా :)

రాజ్ :))
అంతా మాయ
మలేసియా లో మసక మసక :)

హరే కృష్ణ said...

కార్తిక్ నిజం
its a lie :)

అపర్ణ థాంక్ యూ :)

శివ రంజని గారు విధి వక్రీకరించి నేను ఇంకా మలేసియా వెళ్ళలేకపోయాను :(
thanks!

హరే కృష్ణ said...

అవును రాజ్ ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఇదంతా చాలా సహజం :)
next part తప్పకుండా రాస్తాను :)


స్నిగ్ధ గారు థాంక్ యూ అండీ
ఎవరి బ్లాగులో ఎం జరుగుతోందో అసలు కామెంలేకపోవడానికి కోటి కారణాలు అనే సిరీస్ రాద్దామనుకుంటున్న అండీ ఈ పోస్ట్ కి వచ్చిన స్పందన చూసి :)
నిజమైన స్పందన కి నిప్పెట్టి ఆర్పేసే రోజులున్నంత వరకు ఈ బ్లాగు కాండ ఆగదు ఆగదు..స్లో ఎమోషన్ లో :)
thanks a lot for your encouraging support

నేస్తం said...

ee story elaa miss ayyaanu?..ee madya blogs choodatam ledu... nenoo next part kosam waiting ..baagaaraasaav

Naresh said...

బాగుంది బ్రదర్
ఈ మధ్య నీ బ్లాగు లో కామెంట్లు రాసే తీరిక దొరకడం లేదు..రీడర్ లోనే చదువుతున్న.

హరే కృష్ణ said...

అక్కా ..థాంక్ యూ :))


నరేష్ థాంక్స్ :)
keep visiting!

Unknown said...

హ్మ్ నిజమే నేస్తం గారు నేను కూడా మిస్ అయ్యాను .. :( ఈ హరే కృష్ణ కి బాగా గుట్టు ఎక్కువయిపోయింది ..
హహ నాకు తెల్సి నువ్వు ప్రతీక్ అయ్యి ఉంటావ్ .. :) .. పాపం అన్వేష జీవితం తో ఆడుకుంటావా .. నీకు కిడ్ని ఏ లేదు ..

ఇందు said...

కథ ఇంకా ఉందా హరే గారూ!!?? ఉంటే వెంటనే రాసేయండీ...అది సరేగానీ........
>>అన్వేష్: డాక్టర్! నిజం చెప్పండి ఇప్పుడు నా దగ్గర ఎన్ని కిడ్నీలు ఉన్నాయి

ఇది నాకు అర్ధం ఐతే ఒట్టూ!! ;)

ఇంతకీ మీరు అన్వేషా? ప్రతీకా?? ప్రతీకే అయ్యుంటారు ;) పాపం అన్వేష్!! :(((((((

హరే కృష్ణ said...

ఇందు,కావ్య చాలా థాంక్స్
హ హ్హ..నా కిడ్నీ కి ఎసరు పెడతారా :))
ప్రతీక్ ని నేనే నా ? :)
కొత్త పోస్ట్ లో రాసాను ఎవరో :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇంతకీ కధకి ముగింపు ఎల్లా? పగ, ప్రతీకారం , రక్త చరిత్ర కి ఎదురు చూస్తున్నాము.

హరే కృష్ణ said...

గురువు గారు అంతే అంతే మనం అసలు తగ్గేది లేదు
పగ మామూలుగా ఉండదు ఒక గాడ్ ఫాదర్ గుర్తుకు రావాలి అంతే:)
థాంక్ యూ :)

మధురవాణి said...

ఆ తర్వాతా ఎం జరిగిందీ ఈ ఈ ఈ... అన్నీ ఇలా మధ్యలో ఆపేస్తున్నారేంటి.. మేమొప్పుకోం.. సమ్మె చేస్తాం మీ బ్లాగు ముందు.. :P

హరే కృష్ణ said...

మధుర :)
నేను కూడా అన్ని కధలు పూర్తి చేయడానికి అష్ట కష్టాలు పడుతుంటాను మా మేనేజర్ వచ్చేస్తాడు..చివరకి ఇలా అయిపోతుంది
నేను సారీ ప్రతీక్ ఇప్పుడు ఇండియా వచ్చేసాడు కదండీ..మలేషియా లో ఏం జరగబోతుందో వారం రోజులు వేచి చూడాల్సిందే :)
మే డే అయ్యి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే సమ్మె నా ?..బ్లాగు కార్మికుల ఐక్యత్వం వర్ధిల్లాలి :)

thankyou :)