Pages

Wednesday, April 27, 2011

The Prestige

Every magic trick consists
of three parts, or acts.

The first part is called "the pledge."

The magician shows you
something ordinary.

A deck of cards, a bird or a man.

He shows you this object

Perhaps he asks you to inspect it,

to see that it is indeed real
unaltered, normal.
But, of course, it probably isn't.

The second act is called "the turn"

The magician takes
the ordinary something

and makes it do
something extraordinary

Now you're looking for the
secret, but you won't find it

because, of course,
you're not really looking.

You don't really want to know.

You want to be... fooled

But you wouldn't clap yet,

because making something
disappear isn't enough.
You have to bring it back.


That's why every magic trick
has a third act.

The hardest part.

The part we call..

"The Prestige."

Angier అనే మెజీషియన్ ని వాటర్ టాంక్ లో చంపినట్టుగా Borden పట్టుబడటం తో కధ మొదలవుతుంది
కోర్ట్ లో బోర్డెన్ కు ఉరిశిక్ష ని విధించమని తీర్పిస్తారు
తన కూతురు భవిషత్తు గురించి ఆలోచిస్తూ జైలు లో రోజులు గడుపుతున్న Borden దగ్గరకు ఒక రోజు Owens అనే వ్యక్తి వచ్చి, తమ బాస్ Lord Caldlow కి బోర్డెన్ మేజిక్ సీక్రెట్స్ కి చెబితే,బోర్డెన్ చనిపోయాక తన కూతురు భవిష్యత్తు ని చూసుకుంటా అని హామీ ఇస్తాడు.. అంతే కాక, LordCaldlow అసిస్టెంట్ అయిన Mr .Owens జైలు లో ఉన్న బోర్డెన్ కి అతని శత్రువు అయిన Angier dairy ని అందచేస్తాడు.

**************************************************************************************************************

Robert Angier, Alfred Borden ఇద్దరు యువకులుగా ఉన్నప్పుడు Cutter (Michael Caine) దగ్గర మెజీషియన్స్ గా తమ కెరీర్ ని మొదలు పెడతారు.
Angier భార్య కూడా Borden మరియు cutter తో కలసి మేజిక్ షో లో perform చేస్తూ ఉంటుంది. ఒకసారి ట్రిక్ లో భాగంగా బోర్డెన్ తన చేతులు కట్టినప్పుడు knot సరిగ్గా కుదరక నీళ్ళలో మునిగి స్టేజ్ మీద అందరూ చూస్తుండగా చనిపోతుంది Angier భార్య. Traditional knot కాకుండా Borden వేరే విధంగా చేతులు కట్టడం వల్లనే తన భార్య చనిపోయిందని Angier నిర్ధారించుకొని, Borden పై ద్వేషం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వేరు వేరుగా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెడతారు.

గతాన్ని మర్చిపోలేని Angier తన భార్య చావుకు కారణం అయిన Bordenని, ఒక ప్రదర్శన మధ్యలో ఉండగా వెళ్లి షూట్ చేస్తాడు. కానీ అది కాస్త మిస్ ఫైర్ అయ్యి Borden చేతి వేలుకు మాత్రమే గాయమవుతుంది. విషయం తెలుసుకున్న Borden కోపంతో Angier బర్డ్ కేజ్ illusion ని ఫెయిల్ చేసి Angier reputation ని దారుణంగా దెబ్బ తీస్తాడు.


బోర్డెన్ ఎంతో మంది ప్రజలను తన ట్రిక్ "The Transported Man" తో ఆకర్షిస్తాడు. ఇది చూసి తట్టుకోలేని Angier తన లాగ కనపడే ఒక డబుల్ (రూట్) ని తీసుకొచ్చి బోర్డెన్ ట్రిక్ ని దొంగలించి "The New Transpoted Man " గా పెర్ఫార్మ్ చేస్తాడు. అయితే బోర్డెన్ కి Angier డబుల్ వాడుతున్నాడు అనే విషయం తెలిసిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న Angier తన దగ్గర పని చేస్తున్న Ms.Olivia (Scarlett Johansson ) ని గూఢచారి గా వెళ్ళమని చెప్పి బోర్డెన్ దగ్గరకు పంపిస్తాడు.


దీనికి విరుద్ధం గా,ఊహించని విధంగా Olivia బోర్డెన్ తో ప్రేమలో పడి, Angier సీక్రెట్స్ అన్నీ బోర్డెన్ కి చెప్పేస్తుంది.

Angier సీక్రెట్స్ తెలుసుకున్న బోర్డెన్, Angier ఇచ్చే ఒక ప్రదర్శనలో అతను మాయం అయ్యేటప్పుడు స్టేజ్ కింద వేసిన mattress ని తీసేసి అతని ఎడమకాలును విరగ్గోట్టేలా చేసి "The New Transpoted Man "ట్రిక్ ని అందరి ముందు
అపహాస్యం చేస్తాడు. కాలి గాయంతోనే ఒలివియా ఇంటికి వెళ్లి "నువ్వు తనతో ఒక్కటైపోయావ్..నా ట్రిక్ చెప్పి నా కాళ్ళు విరగడానికి నువ్వే కారణం అయ్యావ్" అని తనని నిలదీస్తాడు Angier. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతుల్లో బోర్డెన్ డైరీని పెట్టిన ఒలివియా పై మళ్లీ కాస్త నమ్మకం కలుగుతుంది Angier కి. cipher తో మొదలైన ఆ డైరీ ఏమీ అర్థం కాదు Angier కి. మొత్తం నోట్స్ ని కాపీ చేసేసుకొని పొద్దున్న కల్లా ఇచ్చేయాలి అని అన్న ఒలివియా తో, "ఆ హ్యాండ్ రైటింగ్ నాకు అర్ధం కావడం లేదు, నేను తిరిగి మళ్ళీ ఇవ్వలేను" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు Angier ఆ డైరీ తో సహా.

బోర్డెన్ illusion ట్రిక్ కోసం, Angier Cutter తో కలసి బోర్డెన్ ఇంజనీర్ అయిన Fallon ని కిడ్నాప్ చేసి బతికుండగానే ఒక coffin లో బంధిస్తాడు. Fallon ని తిరిగి ఇవ్వాలంటే తన ట్రిక్ కి solution చెప్పమని బోర్డెన్ ని అడుగుతాడు Angier


దానికి జవాబుగా Tesla అని ఒక నోట్ పై రాసి ఇస్తాడు బోర్డెన్. Angier టెస్లా కోసం Colorodo springs కి వెళ్తూ ఈ సినిమా మొదట్లో ఇలా చెబుతాడు.

A search for answers.

Even if Colorado
is the end of my journey,

it'll take much longer to unravel

the rest of Borden's secrets
See, the cipher in his notebook is

unlocked by a single word,

but it will still take months
to translate his writing

And to know his mind

Well, my passion is equal to the task


Colorodo Springs Angier Tesla అసిస్టెంట్ Alley ని కలుస్తాడు.
Angier :- I've come to see Tesla.
Alley :- Why?
He made a machine
for a colleague of mine some time ago.

అని చెప్పి బోర్డెన్ కి మీరు చేయించిన మెషిన్ నాకు కూడా కావాలి అని అంటాడు
Angier :Can you get me a meeting with him?
Alley :Impossible, I'm afraid.
Angier :I've brought a lot of money.
Alley :I'm sorry, Mr. Angier.
I simply can't help.
Angier :I'll be staying at the hotel, indefinitely.

ఒక రోజు Tesla Angier ని పిలిచి తనకి కూడా ఒక మెషిన్ ని తయారుచేస్తా అని చెప్పి చాలా డబ్బు తీసుకొని research చేస్తూ ఉంటాడు. రోజుల తరబడి మెషిన్ కోసం ఎదురు చూస్తూ బోర్డెన్ డైరీ ని హోటల్ లో కొంచెం కొంచెం చదువుతూ తన హేండ్ రైటింగ్ ని అర్ధం చేసుకుంటూ తన ట్రిక్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొన్ని రోజులకి డైరీలో ఒకచోట, ఒలివియా నిజంగా బోర్డెన్‌కి ప్రపోజ్ చేసినట్టు రాసి ఉండడంతో anxiety ఆపుకోలేక చివరి పేజ్ కి వెళ్లి చదువుతాడు.


to you, Angier.

Yes, Angier, she gave you
this notebook at my request.

And yes, "Tesla" is merely
the key to my dairy, not to my trick.

You really think I'd part
with my secret so easily after so much?

Goodbye, Angier.

May you find solace
for your forward ambition
back in your American home.
అని ఉంటుంది.


వెంటనే ల్యాబ్ కి వెళ్లి తన కోపాన్ని Tesla పై చూపిస్తాడు. Tesla ఒక teleportation machine ని చూపించి ఆ మెషిన్ లోనికి వెళ్తే డబుల్/డూప్లికేట్ మరింత దూరం లో ప్రత్యక్షం అవుతాడు. ఇది మొదట గా ఒక hat తర్వాత ఒక cat మీద ప్రయోగం చేసి చూపిస్తాడు.

తర్వాత రోజు టెస్లా లేబొరటరీ ని ఎడిసన్ మనుషులు కాల్చేస్తారు..ఇంత డబ్బు వృధాగా ఖర్చయిపోయింది టెస్లా ఏమీ ఇవ్వలేదు అని భాదతో హోటల్ కి తిరిగి వచ్చిన Angier కి ఒక మెషిన్ టెస్లా మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి హోటల్ యజమాని అందచేస్తాడు. అయితే టెస్లా దీన్ని ఎక్కువ రోజులు వాడద్దు నీ అవసరం అయిపోయాక ఆ మెషిన్ ను destroy చెయ్యమని ఒక నోట్ లో రాసి చెబుతాడు.


Angier కోలోరోడో నుండి లండన్ వచ్చేసి tesla మెషిన్ తో "The Real Transported Man " ట్రిక్ ని ప్రవేశపెట్టి ఒక అధ్బుతాన్ని సృష్టిస్తాడు. మెషీన్ లో ఎంటర్ అయ్యి కాసేపయ్యాక బాల్కనీ లో ప్రత్యక్షమయ్యే Angier ట్రిక్ కి వచ్చిన అద్బుతమైన స్పందన ని చూసి బోర్డెన్ కి ఇంకా కోపం పెరిగిపోతుంది. అంత అద్భుతమైన రహస్యమేంటో కనుక్కోవడానికి ఒకరోజు Angier చేస్తున్న ప్రదర్శన కి వెళ్తాడు బోర్డెన్.


ప్రదర్శన ఇచ్చే ముందు ఎప్పటిలానే Angier ఈ మెషిన్ ని కావాలంటే audience ని చెక్ చేసుకోమని చెప్పాక మారు వేషం లో ఉన్న బోర్డెన్ స్టేజ్ మీద కు వెళ్ళి, బేస్ మెంట్ లో ఉన్న apparatus సెక్షన్ లో పూర్తిగా నీళ్ళతో ఉండిన టాంక్ ను వెళ్ళి పరశీలిస్తుండగా హఠాత్తుగా Angier వచ్చి ఆ ట్యాంక్ లో పడతాడు. పడిన వెంటనే ఆటోమాటిక్ గా లాక్ అయిపోతుంది హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఆ టాంక్ లో ప్రాణాలు విడుస్తాడు Angier. Angier ని బోర్డెనే హత్య చేశాడు అన్న ఆరోపణలతో అతడికి ఉరిశిక్ష పడుతుంది.


ఇంతకు ముందే బోర్డెన్ ఒలివియా ల మధ్య సంబంధం పీక్ కి చేరడం తో ఆ మానిసిక క్షోభ ను తట్టుకోలేక బోర్డెన్ లోయల్ గా తనతో ఉండకపోవడం తో బోర్డెన్ భార్య ఉరి వేసుకొని చనిపోతుంది. ఒంటరి అయిన బోర్డెన్ కూతురు భవిష్యత్తు ఏమవుతుందో తెలియక జైలు లో ఉరి వేసే రోజు దగ్గర పడుతుండడం తో తన secrets ని *Lord Caldlow కి *చెప్పి కనీసం తన కూతురికి మంచి జీవితం ఇవ్వాలని, ఆ తర్వాత రోజు Caldlow ని కలవడానికిసిద్ధపడతాడు.

బోర్డెన్ Caldlow ని కలసి "The Transported Man" ట్రిక్ తో సహా అన్ని secrets ఉన్న పేపర్స్ Caldlow కి ఇస్తాడు. అయితే అనూహ్యంగా Caldlow చిన్నగా నవ్వి ఆ పేపర్స్ ని బోర్డెన్ ముందే చించేస్తాడు. అప్పుడు చూపిస్తాడు Caldlow మరెవరో కాదు Angier నే అని. చెయ్యని నేరానికి శిక్ష ని అనుభవిస్తూ బోర్డెన్ Angier ని ఎంత వేడుకున్నా Angier కనీసం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

లాజిక్:టెస్లా ఇచ్చిన మెషిన్ వల్ల ప్రతి షో perform చేసాక ఒక డూప్లికేట్ రిలీజ్ అవుతాడు. డూప్లికేట్ ప్రతి రోజూ స్టేజ్ కింద ఉన్న నీళ్ళ టాంక్ లో పడి చనిపోగా, ఒరిజినల్ కొంత దూరం లో ప్రత్యక్షం అవుతాడు. ప్రతిరోజూ Angier షో అయ్యాక చనిపోయిన డూప్లికేట్ ని సిటీ కి దూరం లో ఉన్న warehouse లో దాచిపెట్టి వంద ప్రదర్సనలు అయ్యాక మెషిన్ తో పాటు ఈ వంద dead body లను పెట్టి తగలబెడదామన్నది Angier ప్లాన్.


Lard Caldlow ఆ మెషిన్ ని తీసుకున్నాడు అని Cutter కి caldlow అసిస్టెంట్ చెప్పడంతో Cutter Caldlow ఇంటికి వెళ్లి అక్కడ Angier ని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చనిపోయావనుకొని నేను అనవసరంగా సాక్ష్యం చెప్పాను నీ తరపున నేను ఇక్కడికి వచ్చింది కూడా Caldlow ని ఆ మెషిన్ ఉపయోగించొద్దు అని చెప్పడానికి అని చెప్పి,

Cutter :I came here to beg Lord Caldlow to let me destroy that machine. I am not going to beg you for anything.
Angier :You don't have to. I'm gonna make sure it is never used again.
Cutter:where do you want me to deliver it?
Angier :My theater. It belongs with the prestige materials.


బోర్డెన్ కి ఉరిశిక్ష వేసే రోజు వస్తుంది..ప్రజల దృష్టి లో చనిపోయిన Angier ఆ రోజు తన warehouse కి వస్తాడు. Angier గురువైన Cutter, నిజం తెలుసుకొని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిన కొద్ది సేపటికి బోర్డెన్ వచ్చి Angier ని షూట్ చేస్తాడు.


బోర్డెన్,అతని దగ్గర పని చేస్తున్న ఇంజనీర్ Fallon ఇద్దరూ identitical ట్విన్స్ అని అసలు విషయం చెబుతాడు. ఒలివియా తో కలసి ఉంటుంది నేను కాదు ఫల్లోన్, తన కోసం Fallon జీవితాన్ని త్యాగం చేసి జైలు కి వెళ్ళాడని నిజం చెప్పి, Angier ని చంపేయడం తో కధ ముగుస్తుంది.


సినిమా అయిపోయాక వెంటనే Cutter (Michael Caine) ఇలా చెబుతాడు.


Every magic trick
consists of three parts, or acts.


The first part is called "the pledge.


The magician shows you
something ordinary.

The second act is called "the turn."

The magician takes
the ordinary something

and makes it into
something extraordinary.


But you wouldn't clap yet,
because making something disappear

isn't enough. You have to bring it back.

Now you're looking for the secret.

But you won't find it, because,
of course, you're not really looking.

You don't really want to work it out.

You want to be fooled.


టైటిల్స్ వేసేస్తాడు...ఒక మంచి సౌండ్ ట్రాక్ తో, ఒక ఎండింగ్ లేకుండా, ఏమిటిది హీరో అయిన Angier ని చంపేసాడు అని అనుకున్నా. రెండు గంటలు తల తినేసిన దర్శకుడిని మనస్పూర్తిగా తిట్టకుండా ఉండలేము అనేది మొదటి reaction :) సెకండ్ హాఫ్ మళ్ళీ మళ్ళీ చూసాక వావ్ అనిపించింది. సినిమా గురించి సూటిగా చెప్పాలంటే, సినిమా స్టొరీ కంటే దర్శకుడు మనల్ని ఆలోచింప చేసే విధానం ఈ సినిమాకి హైలైట్.

MTech చేస్తున్న కొత్తలో ఈ సినిమా చూసి ఆ ఆ మరుసటి రోజు మా ఫ్రెండ్ కి చూపించాను బావుంది ఈ సినిమా చూడు అని.. మా వాడు ఒక్కటే సమాధానం ఇచ్చాడు కధకి సరిగ్గా సరిపడే టైటిల్ పెట్టాడు అని.
ఎందుకు ? అని అడిగితే , "బుర్ర ని బాగా ప్రేస్టీజ్ లో ఉడకెట్టేశాడు" అని వాడి నుండి సమాధానం.


రెండో సారి చూసాక.. చూడడానికి ధైర్యం చేయరు జనరల్ గా రెండో సారి. .మనం అర్ధం చేసుకునే విధానం లో ఖచ్చితంగా మార్పు వస్తుంది..మూడు డిఫరెంట్ ట్రాక్ లు నేరేట్ చేస్తూ సినిమా మొదలు అవ్వడం చివర్లో మనం ఎండింగ్ ని అర్ధం చేసుకొనే విధానం వల్ల mutiple viewing must :) for this Nolan's Masterpiece!

సినిమాను ఎలా ముగించాడు అని మనం ఆలోచిస్తే interpretations unlimited :
interpretation 1 : Angier colorodo లో జరిగిన టెస్లా ఎపిసోడ్ ద్వారా మోసపోయి(మెషిన్ డబుల్ ని క్రియేట్ చేయడం) ఎడిసన్ మనుషులు టెస్లా ప్రయోగశాలను కాల్చేశారు అనే అబద్ధం చెప్పి Angier కి ఒక డబ్బా ఇచ్చేసి
జంప్. ఒకవేళ టెస్లా మీద Angier కేస్ వేస్తే వరల్డ్ ఫేమస్ మెజీషియన్ కి అంత కంటే మరో అవమానం ఉండదు.
టెస్లా కొయిల్ -లైట్ ప్రొడ్యూస్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. తను "The Real Transported Man " లో ఉపయోగించింది డబుల్ (రూట్) నే. వాటర్ ట్యాంక్ లో చనిపోయింది రూట్.


interpretation 2:"The Real Transported Man " one of the 100th షో అయ్యాక ఆ వాటర్ ట్యాంక్ ను క్లాత్ తో కవర్ చేసి ఒక బండి మీద వెళ్తుంటే Fallon ఫాల్లో అవడం సినిమాలో చూపిస్తాడు..అది కూడా Angier ట్రిక్ లో భాగం కావొచ్చు
dummies /Wax బొమ్మలను Fallon /Borden కి నమ్మకం కలిగించేలా చేస్తాడు. అంటే వేర్ హవుస్ లో ఏదో జరుగుతోంది అనే నమ్మకం కలుగుతుంది బోర్డెన్/Fallon ఇద్దరికీ.

ఇంకా క్లియర్ గా చెప్పాలంటే duplication /డబుల్ క్రియేట్ అవుతుంది అని నమ్మించడానికి జైల్లో ఉన్న బోర్డెన్ కి తన డైరీ ని Lord Caldlow గా పరిచయమ అయ్యి తన డైరీ ని అందచేస్తాడు. డైరీ లో కూడా వ్యూహాత్మకంగా cipher నుండి మొదలు పెట్టడం తో జైలు లో ఉన్న బోర్డెన్ ఇంకా నమ్మడానికి దోహదపడేలా చేస్తాడు. చివరికి Borden, Fallon ఒకే లా ఉండటం తో ఫల్లోన్ ఉరికంబం ఎక్కుతాడు. బోర్డెన్ Angier ని చంపేస్తాడు. ఉరి వేసినప్పుడు చనిపోయింది బోర్డెన్ ఖచ్చితం గా కాదు,చనిపోయింది Fallon. ఎందుకంటే ఉరి తాడు వేసే క్షణాల ముందు Abracadabra అని చెప్పి చనిపోతాడు.

interpretation 3 : for a Happy Ending :) మెషిన్ లో డబుల్ క్రియేట్ అయ్యింది చివరికి చనిపోయింది Angier కాదు. చివర్లో Angier బోర్డెన్ కి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అబద్దం. ఒక డబుల్ క్రియేట్ అయ్యాడు వాడిని నేను చంపేసాను అని చెబుతాడు. చెప్పడం వరకే నిజంగా చంపాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అదే నిజం అయితే రూట్,మెషిన్ ద్వారా నోలన్
చివర్లో ఒక హింట్ కూడా ఇస్తాడు. ఈ లాజిక్ కరెక్ట్ అని చెప్పడానికి లార్డ్ caldlow కట్టర్ తో మాట్లాడేటప్పుడు మరియు Lord caldlow గా బోర్డెన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు కాలు విరిగిపోయిన Angier చేతి కర కనిపిస్తుంది. చివరి సీన్ లో Warehouse లో తను నడిచేటప్పుడు angier చేతి కర్ర ఉండదు :)

Friday, April 22, 2011

కఠోర కూత..


ఏప్రిల్ 30 1997
ప్రదేశం: విజయవాడ సరిహద్దులు
ఏం జరుగుతోందిక్కడ : టేలంట్ హంట్

ఎందుకు:కెన్నెడీ హై స్కూల్
అకడమిక్స్ లో  కేకాయే
స్పోర్ట్స్ లో వీకాయే

district wise ఆటల పోటీల్లో  నిరంతరం  చివరి స్థానానికి కాంట్రాక్ట్ తీసుకున్నట్టు గత పదేళ్లుగా ఒక్క సారి కూడా ఆఖరి స్థానం నుండి తప్పించుకోలేని స్థితి ని చూసి చూసి విసిగి వేసారి పోయిన  పాఠశాల రూపు మార్పడానికి ఆ సంవత్సరం నుండి చుట్టు ప్రక్కన గ్రామాల్లో ఉన్న విద్యార్ధులకు ఉచిత విద్యను అందిస్తూ IPL టీమ్ లో నాలుగు overseas ప్లేయర్స్  ఉన్నట్టు  నలుగురు గ్రామ సింహాలను టీం లోనికి తీసుకొచ్చేలా యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు..

ఆటల  పోటీల పతకాలను సాధించి స్కూల్ పరువును  పతాక స్థాయి లో  పరుగులెట్టించడానికి  గేర్ మార్చి , ఏప్రిల్ లో గ్రామ సింహాలను  గైకొని పోయెను

 కట్ చేస్తే ..
వేసవి సెలవుల్లో గ్రామాల్లో నుండి ఒక్కోతరగతి కి నలుగురు చెప్పున నైపుణ్యమైన  క్రీడా బాలురను చేర్చుకున్నారు  
ఎప్పట్లానే సంవత్సరపు క్లాసులు జూన్ లో  మొదలయ్యాయి



జూన్ 25 ,1997
నాలుగవ తరగతి
కెన్నెడీ హై స్కూల్ లో ఒక సాయంత్రం
సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిముషం


ఎప్పటిలానే లాస్ట్ అవర్  బెల్ మోగింది..పిల్లలంతా ప్లే గ్రవుండ్ వైపు పరుగులు తీసారు..కెన్నెడీ స్కూల్ వాళ్లకు ఆరోజు డిఫెండింగ్ చాంపియన్స్ అయిన సిస్కో sponsored  డాన్ బాస్కో డిస్కో ఉస్కో  తో చాలా కీలక మ్యాచ్ వచ్చి పడింది.


సమిత్ తన బేగ్,లంచ్ బాక్స్ ను  క్లాస్ లో వదిలేసి  వైట్ షూస్ తో కబడ్డీ ఫీల్డ్ లోనికి వెళ్ళాడు

కెన్నెడీ కేక క్రోస్ Vs డాన్ బాస్కో డిస్కో ఉస్కో
కెన్నెడీ టీం లో

ఓవర్ సీస్ హైప్డ్  ప్లేయర్స్ :-
పెనమలూరు నుండి పరేష్
రామవరప్పాడు నుండి రాజేష్
ఉయ్యూరు నుండి  అన్వేష్   :)
ఇబ్రహీం పట్నం నుండి ఇంద్రేష్ ఈ నలుగురు గ్రామ సింహాలు మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ పేరు చెప్పి ప్రక్కోళ్ళ లంచ్ బాక్స్ లు ఖాళీ చేస్తూ బిజీ గా ఉన్నారు..

శంకర్ మహదేవన్ పాటలు విని వినీ బ్రెత్ లెస్ పాటలు ప్రాక్టీస్ చేసి విఫలమయ్యి కబడ్డీ కూత ను రెగ్యులర్ కూత తో పాటు వేరే ఏదైనా ఆప్షనల్  గా మార్చుకునేలా అన్ని స్కూళ్ళ  వాళ్ళు అంగీకరించడం తో వికెట్ కీపర్ గా చేరిన ప్లేయర్ బేట్స్ మన్ కం కెప్టైన్ అయినట్టు కెన్నెడీ స్కూల్ కి ప్లస్ అయ్యింది..

గ్రౌండ్  లో గేమ్ కోసం టాస్ వేసారు
సమిత్ వాళ్ళ టీమ్ కూత మొదలెట్టింది

పెనమలూరు సింహా పరేష్ ముందు వెళ్ళాడు..చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం.. చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం.. అని అరచుకుంటూ ఇద్దరిని అవుట్ చేసి వచ్చాడు

తర్వాత రెండో టీమ్ నుండి ఒకరు  వచ్చి సమిత్ వాళ్ళ టీమ్ లో ఒకర్ని అవుట్ చేసాడు
క్లాస్ లో నుండి ఒక అమ్మాయి చదువుతూ మధ్య మధ్య లో ఈ ఆటను చూస్తోంది కూత తర్వాత వంతు సమిత్ ది
సమిత్ లైన్ దగ్గరకు వెళ్ళాడు లైన్ క్రాస్ అవుతూ సందేహం లేకుండా గట్టిగా నక్క లా ఒక ఊల  వేసాడు..వెంటనే ఆ  అమ్మాయి ఒక ఈల వేసింది  సమిత్  కూత మొదలెట్టాడు..

దాక తెచ్చుకో దుమ్ములేరుకో..మధ్య మధ్యలో ఊలల స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరికీ నరకానికి చివర వరకు తీసుకెళ్ళిపోయాడు...కూత ని ఎంతకీ ఆపడం లేదు..చివరికి విండో వెనుకున్న అదే అమ్మాయి యాక్ యాక్ అని ఆ  తింటున్న చిప్స్ కక్కేసింది వెంటనే ఆ  కూత చూసి చివరి నిముషం లో మ్యాచ్ fixing ఆరోపణలు ఎదుర్కుంటున్న అన్వేష్  వచ్చాడు...

రాతిరి పది గంటలకు  పొలం లో ఎత్తేసిన చెరకు మూటలకు మా నాన్న కొట్టిన దెబ్బలకు   జువిచ్ ఊ..జువిచ్ ఊ ..జకోవిక్ లా ఈ జువిచ్ ఏమిటో అని జనాలు జుట్టు పీక్కోవడం మొదలు పెట్టారు

ఈ బాష మరీ కఠోరం గా ఉండడం తో అన్వేష్ కి రెడ్ కార్డ్ లేకపోవడం తో ఎల్లో కలర్ లో ఉన్న ప్రోగ్రెస్ కార్డ్ ని ఇచ్చేసి వార్నింగ్ ఇచ్చాడు రిఫరీ  

వెంటనే సబ్ స్టిట్యూట్  ఇంద్రేష్ వచ్చి... నీకు నాకు మాటలు లేవు.. ఎలుగు బంటి కి వెంట్రుకులు లేవు అని తన ట్రేడ్ మార్క్ కూతతో అందరినీ అలరించాడు


సమిత్ వాళ్ళ టీం దాదాపు గెలిచేసినట్టే..ఇరవై పాయింట్ల లీడ్ లో ఉంది ఆట కు  మరో రెండు నిమిషాలు మిగిలి  ఉంది..ఆఖరున ఇక కెప్టైన్ సమిత్ తో ఈ సారి నువ్వు నార్మల్ కూత తో రెండు నిముషాలు వేస్ట్ చేసి వచ్చేసేయ్ అని చెప్పి పంపించాడు.



సమిత్  ముందు కబడ్డీ కబడ్డీ కబడి బడి బడి బడి బడి అని ఊపిరి అంతా ఆగిపోయేలా breathless బడి power of n  ని ధ్యానిస్తూ కోర్ట్ అంతా పరిగెడుతూ అరుస్తూనే ఉన్నాడు..అలసట ఆఖరు క్షణం లో సమిత్ మీద ఒక్క ఉదుటున ఇద్దరు పట్టుకుని వెనక్కు లాగేశారు

సమిత్ అలసి పోయి ఇంక నే ఇంటికెళ్తున్నా  అని కోచ్ కి చెప్పి క్లాస్ రూంలో ఉంచేసిన లంచ్ బాక్స్ తీసుకు రావడానికి వెళ్ళాడు..సూర్యాస్తమయం అవ్వబోతోంది..అసలే నీరసించిపోయి ఉన్న సమిత్ పై సూర్య కిరణాలు వెల్లువలా వచ్చి మొహం మీద  పడుతున్నాయి..జీవితం లో సమిత్ కు  మొదటి సారి సూర్య రశ్మి కి సల్మాన్ రష్డీ బుక్ కి తేడా తెలియనంత భావం చోటు చేసుకొని క్లాస్ రూమ్ అలా ఎంటర్ అయ్యి మొదటి బెంచ్ మీద పడిపోయాడు.


సరిగ్గా అప్పుడే incredible పుస్తకాల చీడపురుగు చైత్రి  ఈ దృశ్యాన్ని చూసి మంచి నీళ్ళు తో  పాటు మజా,మిరిండా కాసిన్ని చిప్స్ కుక్కేసి తిరిగి ఊపిరి తో పాటు సమిత్ కు టేస్ట్ ని ప్రసాదించింది (నాలుగో తరగతికి పిల్లలకు మాత్రమే అన్ సెన్సార్డ్ :)

బాల్యం బెస్ట్ ఫేజ్ లో ఉన్న కిక్ తీసుకొస్తున్న దశ లో విధి ఫుట్ బాల్ ఆడి సమిత్ వాళ్ళ నాన్న కు UK లో వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళడానికి ఇంకో రెండు రోజులుందనగా


సమిత్:అక్కడ డాడ్ తో పాటు మేము కనీసం మరో పది సంవత్సరాలు ఉండొచ్చు చైత్రి.
చైత్రి:నీతో నేనూ వస్తాను సమిత్
సమిత్:నీ దగ్గర ఉన్న విజయవాడ బస్ పాస్ ఏం వరల్డ్ వైడ్ విసా కాదు.. ఎక్కడి బడితే అక్కడికి వెళ్ళిపోవడానికి.. నన్ను మర్చిపో అని చెప్పాక 

ఇప్పుడంటే నువ్వు హాస్టల్ లో ఉన్నావ్ మరో పదేళ్ళకి ఎక్కడ ఉంటావో..అందుకే చెబుతున్నా నన్ను మర్చిపో .. అని చెబుతూ చైత్రి తీసుకొచ్చిన చేగోడీలు,జంతికలు,రవ్వలడ్లు బర బరా నమిలేసి చిరు తిళ్ళను చిరు నవ్వుతో ముగించి chilled కూల్ డ్రింక్ ని తాగేసి చారూ ఐ మిస్ యూ సో మచ్ అని చెప్పి భారమైన పొట్టతో నడుస్తూ అక్కడనుండి నిష్క్రమించాడు   



Wednesday, April 6, 2011

అన్వేషణ


41st   floor
పెట్రోనాస్ టవర్స్
మలేషియా

అన్వేష్ తన ఆఫీస్ మార్నింగ్ session ముగించుకొని లంచ్ టైం లో స్కై  బ్రిడ్జి మీదకు వచ్చాడు
Tower 2 నుండి తనవైపే వస్తున్న ప్రతీక్ ని చూసి ఇతన్ని ఎక్కడో చూసానే అని అనుకుంటూ భోజనం చేసేసి మళ్ళీ తన ఆఫీస్ లోనికి వెళ్ళాడు

మధ్యాహ్నం అన్వేష్ ఇంటర్వ్యూ లను చేస్తూ  కాసేపయ్యాక  తన ముందు కూర్చున్న  ప్రతీక్ ని చూసి తన తో కాసేపు  మాట్లాడాక తన resume ని చూసి అన్వేష్ కి చెమటలు పట్టి ఊపిరి ఆడకుండా గిల గిలా కొట్టుకొట్టుకొని కళ్ళుతిరిగి పడిపోయాడు

కళ్ళు తెరిచాక చూస్తే ఒక హాస్పిటల్ లో బెడ్ మీద అన్వేష్ ఉన్నాడు తన పక్కనే చైర్ లో ప్రతీక్
ప్రతీక్: ఇప్పుడు ఎలా ఉంది,సడెన్ గా అలా ఎలా పడిపోయావు అక్కడ
అన్వేష్: డాక్టర్! నిజం చెప్పండి  ఇప్పుడు నా దగ్గర ఎన్ని కిడ్నీలు ఉన్నాయి

డాక్టర్: నువ్వు అతనికి చాలా ఋణ పడి ఉన్నావ్,ఆ  విషయం నీకు తెలుసా.అతనే లేక పొతే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కాదు
అన్వేష్:ఎందుకు ఋణ పడి ఉండడం, ఏం జరిగింది
డాక్టర్: నీ ఫీజులన్నీ అతనే పి చేసాడు తెలుసా ముందు ఆ  ఋణం తీర్చేసేయ్ ,మా హాస్పిటల్ లో ఉన్న టెస్టులన్నీ చేయించేసాం ముందు జాగ్రత్త గా 
అన్వేష్: i don't want pay him..i am leaving right now
అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు
------------------------------------------------------------------------------------------
కట్ చేస్తే
పదేళ్ళ క్రితం
వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ Hyd.
అన్వేష్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు సెప్టెంబర్ మొదటి వారం లో ప్రతీక్ తన ఇంజనీరింగ్  ఫస్ట్ ఇయర్ లో చేరడానికి హాస్టల్ కి వచ్చాడు
హాస్టల్ మెస్ నుండి తన రూమ్ కి వెళ్తున్న అన్వేష్, ప్రతీక్ ని చూసి సాయంత్రం ఒకసారి కనిపించు అని చెప్పి తన రూమ్ నెంబర్ చెప్పి క్లాస్ కి వెళ్ళి పోయాడు
-----------------------------------------------------------------------------------------

ఆరోజు సాయంత్రం
tell me about yourself అని అడిగాక అసలే కొత్త కావడం తో భయం భయం గా అన్ని వివరాలు చెబుతూ ఏడుస్తూ ముగించాడు ప్రతీక్ . అన్వేష్ వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి ఇంకా ఏడిపించసాగాడు
ఇవేమీ పట్టించుకోవద్దు అని చెప్పి ప్రతీక్ ని రూమ్ కి పంపించేశాక ప్రతీక్ రూమ్ లో ఇంకా ఏడవసాగాడు
--------------------------------------------------------------------------------------------

ఆ  మరుసటి రోజు సాయంత్రం
హాస్టల్ గ్రౌండ్ లో అందరినీ సమావేశం అవ్వమని వార్డెన్ అందరినీ పిలిచాడు
సాయంత్రం అంతా వచ్చేసారు..సడెన్ గా  ప్రిన్సిపాల్ కార్ లో దిగి
i told you many times ragging is prohibited and you all know that ..
for god sake it should not be done in our ఇన్స్టిట్యూట్.
who is అన్వేష్... అని గట్టిగా అరిచాడు
అన్వేష్ ని  అందరి ముందు పిలిచి చెంప చెల్లుమనిపించాడు 

ప్రతీక్ అంటే ఎవరు ఇక్కడ అని ప్రిన్సిపాల్ పిలిచాక
అందరి ముందు నిల్చున్నాడు ప్రతీక్, tell me Mr .Prateek ఇతనేనా వేరే ఎవరైనా నిన్ను రాగ్ చేసారా
ప్రతీక్:ఇంకో ఇద్దరు  ఉన్నారు సర్.. రూమ్ లో వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు అని చెప్పేసరికి రాగ్ చేసిన వాళ్ళ ఇద్దరు  సైలెంట్ గా ప్లీజ్ ప్లీజ్ అని సైగలతో వేడుకుంటున్నారు ప్రతీక్ ని
----------------------------------------------------------------------------------
ప్రతీక్: ఇతనే ఎక్కువ చేసారు నన్ను రాగింగ్  వేరే వాళ్ళు పెద్దగా ఏమీ అనలేదు
ప్రిన్సిపాల్:పొద్దున్న నువ్వు కంప్లైంట్ బాక్స్ లో ఏమని రాసావు నిన్న సాయంత్రం  సీనియర్లు ముగ్గురు వాళ్ళ  నాకు చాలా మానసిక క్షోభ కలిగింది అని రాసావ్ కదా.వాళ్ళెవరైనా పర్వాలేదు చెప్పు చెప్పు చెప్పు చెప్పకపోతే నువ్వు అబద్ధం చెబుతున్నట్టే కదా

ప్రతీక్:సరే చెబుతాను (సీనియర్స్ గుండెలు ఇంకా వేగంగా కొట్టుకోసాగాయి )
ఏ పేరు చెప్పాలో తెలియలేదు అలోచించి అలోచించి ఆ  ముందు రోజు రాగింగ్ జరిగిన రూమ్ లో ఒక వస్తువు కనిపించింది అది గుర్తొచ్చి
రాజేష్,సురేష్అని నోటి కొచ్చిన పేర్లు చెప్పేసాడు ప్రతీక్
 ప్రిన్సిపాల్ expressions చూసి  అన్వేష్ కి కోపం మరింత గా పెరిగి పోయింది
అన్వేష్,రాజేష్,సురేష్,లకు మూడు నెలలు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ వెంటనే తన  కార్ లో వెళ్ళిపోయాడు

అన్వేష్ రూమ్ లో కనిపించిన వస్తువు  తన టేబుల్ పైన ఉన్న ఫోటో ఫ్రేమ్
మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే
from రాజేష్,సురేష్ అని ఉంది

ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే రాజేష్,సురేష్ ఇద్దరూ వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో 2nd 3rd ఇయర్ చదువుతున్న అన్వేష్ తమ్ముళ్ళు
ఈ సంఘటన జరిగిన పది  రోజులు తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సలింగ్ జరిగింది. ప్రతీక్ వేరే కాలేజ్ కి మారిపోయాడు.

ఇదంతా గుర్తుతెచ్చుకొని అన్వేష్ నిట్టూర్పుతో హాస్పిటల్ నుండి బయటకు నడిచాడు.. 


25వ follower కు ఈ కధ అంకితం :)