Pages

Sunday, July 25, 2010

బూస్ట్ బాల్యం

లంచ్ అవర్ లో బాల్యానికి బూస్ట్ ఎంతవరకు మేలుచేస్తుంది అనే టాపిక్ ని ఎత్తిన మహానుభావుని దయవల్ల మా చిన్నతనంలోనికి అందరం వెళ్ళిపోయాం
బాల్యమంతా బూస్ట్ కి దాసోహం అని flashback ని ఇలా నెమరు వేసుకున్నాం...


వరుణ్:సచిన్ వచ్చాక బూస్ట్ రేట్లు చాలా రెట్లు పెరిగిపోయింది
రేష్మా:నువ్వు ఆఫీస్ కి వచ్చాక మాకు ఇచ్చే టీ క్వాలిటీ కూడా బాగా పడిపోయింది
వరుణ్:ఎక్కువ టీ తాగితే వర్క్ productivity పెరుగుతుంది అది అర్ధం చేసుకోకుండా నన్ను అంటున్నారు అసలు టీ క్వాలిటీ ఎలా ఉన్నా బూస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరు.  

ప్రసూన్:చిన్నప్పుడు మేము ఒక కిలో బూస్టు తెచ్చుకొని ఇరవై రోజుల్లో ఫినిష్ చేసే వాళ్ళం తెలుసా
వరుణ్:మాకు అయితే మినిమం నెలరోజులు వచ్చేది అది కూడా అర్ధకిలో ప్యాక్ ,మా ఇంట్లో రోజుకి  రెండు పూటలు మాత్రమే తాగనిచ్చేవారు
ప్రసూన్: అవునా
వరుణ్: అయినా మాకు అర్ధకిలో సరిపోయేది మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే కదా అయినా ఎన్ని పూటలు తాగేవాడివి నువ్వు రోజుకి
ప్రసూన్:నేను బూస్ట్ తాగను తింటాను,కావ్యా నీ సంగతేంటి నీకు బూస్ట్ అంటే ఇష్టమేనా 

కావ్య: మా ఊరిలో అప్పటికి బూస్ట్ ఇంకా రాలేదు ప్రసూన్ , నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు మా ఊరికి హెల్త్ డ్రింక్ లు అమ్మే షాప్ పెట్టారు
వరుణ్: కొనేవాళ్ళు ఉంటేనే కదా ఏదైనా అమ్మడానికి ఎప్పుడూ పార్టీ ఇవ్వు పార్టీ ఇవ్వు అని మా ప్రాణాలు తోడేస్తావ్, సరే కాని మరేం తాగేవారు మరి ఏడో తరగతి వరకు
కావ్య: ఆవుపాలు ఇంకా మా పొలం లో పండే పండ్లను ఇంట్లో juice చేసుకొని తాగేవాళ్ళం.

ప్రసూన్:షాప్ వచ్చిన తర్వాత మీరు compensate చేసారా, అయినా మీరు ఇంత కాంతివంతమైన చర్మం ఎలా వచ్చింది
వరుణ్:చిన్నప్పటినుంచి బూస్ట్ తాగే వారు, అందుకే ఇలా
కావ్య:వరుణ్ స్టాప్ ఇట్, చిన్నప్పటి నుండి కాదు అని చెప్పానా ఏడో తరగతి నుండే నేను తెల్లగా అవ్వడం మొదలుపెట్టాను
ప్రసూన్:బ్యూటీ పార్లర్ కూడా అప్పుడే వచ్చిందా అయితే మీ ఊరికి
కావ్య: (సిగ్గుతో కూడిన ఒక నవ్వు నవ్వి) #%#&&##&


మనీష్ :ఒక కిలో బూస్ట్ లో ఎన్ని ప్రోటీనులు,కార్బో హైడ్రేట్  లు ఉంటాయి ??
అచానక్:ఒక కిలో బూస్ట్ లో 26 గ్రాముల  ప్రొటిన్లు, అర కిలో కార్బోహైడ్రేడ్లు వుంటాయి
కావ్య: ఎహే! వెళ్లి ఎవరైనా కే ఏ పాల్ కనిపిస్తే వాళ్లకి చెప్పు నీ statistics.
అచానక్: లేకపోతే
కావ్య:తెలుగు బ్లాగర్లకు చెప్పు
అచానక్:@#$^&^$^$#@##, మరి నువ్వు రేష్మా నువ్వు కూడా బూస్ట్ తింటావా
రేష్మా:నేను తినను, తాగను, పారబోస్తాను. ఎన్ని కిలోలకి  కేలరీలుంటే ఎవడికి కావాలి

అచానక్:బూస్ట్ కి రెండు చెంచాల పంచదార  కంటే ఎక్కువ కలుపకుండా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం
ప్రసూన్:బూస్ట్ లో ఎక్కువ పంచదార వేసుకొని తింటే  మలబద్ధకం వస్తుందని ఈనాడు వసుంధర లో చదివాను
అచానక్:వేడి చేస్తే వెయిట్ తగ్గుతుందని 1023 లో బూస్టిన రాసిన అతీ గతీ లేని భవభొగ వాదం పుస్తకంలో నేను కూడా చదివాను

కావ్య: మీరు ఎంతైనా చెప్పండి బూస్ట్ తింటే తెల్లగా అవ్వరు
ప్రసూన్:అప్పట్లో కావ్య గారి ఊర్లో  బూస్ట్ దొరకపోవటం వలన  తన బంధువర్గ బలంతో విదేశాలనుంచి తెప్పించుకొని తాగే వారు, అందుకే తను ఒక్కత్తే తెల్లగా, తన సఖులందరు, సఖతో సహా అంత తెల్లగా లేరు
కావ్య:నేను చిన్నప్పటి నుండి హార్లిక్సు తాగేదాన్ని. కొంచం పెద్దయ్యాకే బూస్ట్ తాగడం మొదలెట్టా....అన్ని తప్పుడు సమాచారాలిస్తున్నావు నువ్వు. ఇదేనా నీ గూఢచారిత్వం?

అచానక్ :స్కూల్ కి మీరు హార్లిక్స్ డబ్బాలు తెచ్చుకొని తినేవాళ్ళా అందరూ సరే ఇంకేం హెల్త్ డ్రింక్ లు మీ
ఇంట్లో వాడేవారు
కావ్య: కాంప్లాను అంటే నాకు కంపరం,ఓ సారి నాకు జ్వరం వచ్చినప్పుడు మా మావయ్య మా ఇంటికి తెస్తే ఆయన ముందే ఆ సీసా ని పగలకోట్టేసాం
అచానక్:ఏంటి ఖాళీ సీసానా?, రేష్మా మరి మీ ఇంట్లో
రేష్మా: కాంప్లాను బూర్జువా వ్యవస్థకి చెందిన డ్రింకు. అది మేము తాగం



ప్రసూన్:కావ్యా! మరి ఏమయ్యింది ఆ తర్వాత ఆ కాంప్లాన్ ని ఎలా వదిలించుకున్నారు 
కావ్య:వెంటనే మళ్ళీ షాప్ కి వెళ్లి మరో బూస్ట్ తెచ్చేవరకు మా మంకుపట్టుని విరమించుకున్నాం
ప్రసూన్:అచానక్ మీరు  చిన్నపడి నుండి బూస్ట్ తాగేవారా

అచానక్:మా ఇంట్లో మొదట  ఒక ఆరు నెలలు ఆవు కుడిత ని energy డ్రింక్ గా వాడేవాళ్ళం, ఆ తర్వాత viva వచ్చి ఆ లోటుని భర్తీ చేసింది
ప్రసూన్:బూస్ట్ తాగితే ఏమొస్తుంది


బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ  :)
కాదు అవర్ ఎనర్జీ అని ఎవడో ఒకడు అనండెహే!

11 comments:

తార said...

ఒక కిలో బూస్ట్ లో 412 కిలోల ప్రొటిన్లు, అర కిలో కర్బోహైడ్రేడ్లు వుంటాయి

రాజ్ కుమార్ said...

కాంప్లాను అంటే నాకు కంపరం,ఓ సారి నాకు జ్వరం వచ్చినప్పుడు మా మావయ్య మా ఇంటికి తెస్తే ఆయన ముందే ఆ సీసా ని పగలకోట్టేసాం
:"ఏంటి ఖాళీ సీసానా??"

ha ha.. good one.. :)

Unknown said...

our energy!!...nenu anesanu.... :)

viva -kudithi - 150% perfect... :)

..nagarjuna.. said...

:) :)

Anonymous said...

ఇక నవ్వలేను. నా నవ్వుకి కారణం ఇన్ని సంవత్సరాలుగా నేను తాగుతున్న బూస్ట్. తాగండి అందరూ... పొద్దున్నే ఒక కప్పు బూస్ట్. బావుంది, వేడి బూస్టు లాంటి పోస్టు.

హరే కృష్ణ said...

తార గారు నిజంగానా :)
ఇలాంటి సైన్సు విషయాలు రాసేముందు తప్పకుండా మిమ్మల్ని కనుక్కొని ఈ సారి పోస్ట్ రాస్తాను :D

నాగార్జున గారు
thanks :) :)

హరే కృష్ణ said...

రాజ్ కుమార్ & కిరణ్
మీ లాంటి మిత్రుల ప్రోత్సాహానికి థాంకులు :)
thankyou very much
Boost is the secret of our Energy :) :)

హరే కృష్ణ said...

తొలకరి గారు ఆత్మానందం కి స్వాగతం
మీకు నచ్చినందుకు చాలా సంతోషం :)
బూస్ట్ అభిమానుల లిస్ట్ లోనికి కూడా స్వాగతం :)

కృష్ణప్రియ said...

ఇప్పటికీ, మంచి పుస్తకం ఉంటే.. సోఫాలో కూర్చుని ఒక చిన్న కప్ లో బూస్ట్ /బోర్న్ వీటా లాంటివి తెచ్చుకుని చెంచా తో తింటూ చదవటం..(హార్లిక్స్ అయినా పర్వాలేదు.. కాంప్లాన్ తప్ప) నాకు చాలా ఇష్టం :-)

ఆ.సౌమ్య said...

బాబూ బానే కుమ్మేసావ్. ఇందులో సగాంకి పైగా డైలాగులకి నాకు, తార కి పేటెంటు రైట్స్ ఉన్నాయి, మరచిపోకండి. నిన్న జరిగిన చిన్న విషయాన్ని పట్టుకుని టపీమని టపా పీకేసారా...భలే!

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు మీ స్పందనకు థాంక్స్
బూస్ట్ ని అందరూ తినడమేనా
చాలా మంది ఉన్నారే మన batch వాళ్ళు


సౌమ్య గారు తప్పకుండా పేటెంట్లు మీవే :) :)
thanks for the response