Pages

Tuesday, April 27, 2010

పండంటి బ్లాగు కి పది సూత్రాలు




ఫార్ములా 1 : టెంప్లేట్
ఇల్లుని చూసి ఇల్లాలుని చూడమన్నారు పెద్దలు, బ్లాగు లోకం లో మీ టెంప్లేటే మీకు పెద్ద ఎస్సెట్
టెంప్లేట్ మంచిది చూసి తర్వాత పోస్ట్ చూడండి
మచ్చుకి నాకు నచ్చిన కాస్త ఆహ్లాదంగా, ఇంకాస్త అందంగా ,క్లాసికల్ గా,ముచ్చటగా,సూపర్ గా, idealగా  

ఇంకా మైండ్ బ్లాకయ్యేలా  ఎన్నో  ఉన్నాయి టెంప్లేట్స్,ఆఖరిది తప్పిస్తే మిగతావన్నీ నా ఫెవోరేట్ టెంప్లేట్స్


రెండవ సూత్రము : ప్రొఫైల్
ఇక్కడ మీ ప్రొఫైల్ మరియు మీ గురించి చూసి  ఒక అంచనాకు వచ్చేస్తారు(ఆత్రం ), అందువల్ల ఒక మంచి ఫోటో వెతకండి వెతకండి
 

మూడవ సూత్రము :మహాకూజ
maalika
హారం
కూడలి
జల్లెడ
మీ బ్లాగు అగ్గ్రిగేటర్ లో చేర్చుకోండి ఇప్పుడు quickest aggrigator beta versions కూడా రిలీజ్ అయ్యింది ఈ మధ్యనే
ఒక లుక్కేయండి


నాలుగవ సూత్రం:  నాకేంటి
పోస్ట్ రాసే ముందు రెండు రోజులు కాస్త తరచుగా కంమెంట్లు రాయడం మర్చిపోకండి మీరు రాసే ఎటువంటి పోస్ట్ అయినా మొహమాటానికి కొన్ని కామెంట్లు రావాల్సిందే

అయిదవ సూత్రము: అంచనాలు మరియు అల్లాడించడం   
మీకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాక వాటిని అందుకోవడానికి ప్ర
త్నిచడానికి మీ శాయశక్తులా కృషి చేయండి 
అడిగిందే అమ్మ అయినా పెట్టదు, కావున వేరే బ్లాగుల్లో కాస్త తరుచుగా వ్యాఖ్యలు రాయండి 

ఆరవ సూత్రము: ఆపరేషన్ మార్తాండ
కామెంట్లు కావాలా ? మీ టపా లో రంగనాయకమ్మ,చలం అనే పదాలను వచ్చేలా ఎక్కడో ఒకదగ్గర ఇరికిన్చేయండి,మీ బ్లాగులో కామెంట్ల పండగ చేసుకోండి మూడు చర్చలతో ఆరు రచ్చలతో మీ కామెంటు బాక్స్ నింపుకొని ఆనందించండి
ఇంతకీ మార్తాండ అంటే ఎవరు అనే ప్రశ్న వేసారు అంటే?  మీ బ్లాగు వయసు కేవలం పదిరోజులు అయ్యివుంటుంది  మీ లాంటి వాళ్ళ కోసం  ఈ ఒక్క విషయం లో నేను వాల్మీకినై  చెబుతున్నా

 
 (ఈ అఖండ బ్లాగావనిలో సన్నాసుల్లో చేరమనేవోడూ, చాలెంజీలు చేసేవోడు, పొంతనలేకుండా సమాధానాలిచ్చేవాడు, పరమమూర్ఖ లాజిక్కులు చేప్పేవోడు, అసలు విషయం వదిలి అడ్డంగా కామెంట్లు రాసేవోడు, జిడ్డుగా ఒకే పోస్టుకి వందల్లో కామెంట్లు రాస్తూ బుర్రతినేవోడు, సంబంధంలేని వివరణలు ఇచ్చేవోడు, కామెంట్లన్నీ స్టేట్‌మెంట్లలా ఇచ్చేవోడు, మనుషుల మతిపోగెట్టేవోడు, నవ్వించే వోడు…హ.హ.హమ్మ .. ఒకే ఒక్క మూర్ఖాగ్రేసరుండు). 
courtesy :  కేక  

 

ఏడవ సూత్రము: ఏడవండి
మీ ఏడుపే మాకు శ్రీరామ రక్ష
ఒక రచయితను పట్టుకోండి ఒక టపా రాయండి
ఎవరో వ్యాసం పై ఇంకెవరో విమర్శలకి సమాధానం అనే శీర్షికతో టపాలు రాసేసి మీ పేరు ని పాపులర్ చేసేస్తారు 
ఫ్రీ పబ్లిసిటీ :)

ఎనిమిదవ సూత్రము: వీక్ ఎండ్స్ లో పోస్ట్ లు
మీ హిట్లను పెంచుకోవడానికి వీక్ డేస్ లో పోస్ట్ చేయండి హిట్లతో పాటు కామెంట్లు కూడా వస్తాయి

తొమ్మిదవ సూత్రం:
   వెంబడించే వాళ్ళు
వెంబడించేవాళ్ళు లేరని బాధ పడుతున్నారా(
మార్తాండ కాదు ఫోల్లోవేర్స్),  మీ బ్లాగు ఏదో ఒక పేపర్లో రావాల్సిందే

పదవ సూత్రం : పగలే వెన్నెల
imagine  చెయ్యండి, మీ ఊహా శక్తి కి పదును పెట్టండి,అంతే కాని పట్టపగలే చుక్కలు చూపించకండి
అక్షరాల రంగు మరియు బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా చాలా ఇంపార్టంట్



మొన్న ఇదే విషయాని మార్తాండ బ్లాగులో ఎవరో అజ్ఞాత రాసినప్పటి సంభాషణ
అజ్ఞాత: మీ బ్యాక్ గ్రౌండ్ కలర్ చాలా డార్క్ గా  ఉంది నల్ల  అక్షరాలు అసలు  కనిపించడం లేదు ముందు ఆ బ్యాక్గ్రౌండ్ ని మార్చండి
క్షవరాల ఖర్మ: మీరే మీ మోనిటర్ brightness ని పెంచుకోండి, అప్పుడు సరిగ్గా బాగా కనిపిస్తుంది   
ఇలాంటి సమాధానాలు చెప్పి  షాక్ లు ఇవ్వకండేం!! 






 

  

 





 

Sunday, April 18, 2010

కర్ణ కఠోరి-డానియల్ వెటోరి

ఈ మధ్య మిత్రుడొక పాట పంపాడు
అనుకోకుండా
నాకు తెలియకుండానే ఈ పాట ఆటచిట్టా (playlist)లో ఎక్కువసార్లు వినిపిస్తోంది
సరే తెగ నచ్చేసింది కదా పాడుదామని ఇలా లిరిక్స్ గుర్తు చేసుకుంటుంటే కర్ణ
కఠోరంగా వున్నాయి  ఈ పదములు 
అయ్య బాబోయ్ సినిమా లో  హీరో ని చూడలేం ఇక్కడ ఈ రాతలు చదవలేం 

స్టొరీ ఉందని హీరోని, రెహమాన్ ఉన్నాడని లిరిక్స్ ని  చూసామో మనకు @#%%%#^%^^%
ఇలా జరిగెను తెలుఖూని  (భావాన్ని ఖూని చేసిన విధంబెట్టిదనిన)
ఈ  పాట యూకోసం..
 

ఈ  హృదయం  కరిగించి వెల్లకే ( హార్ట్ మెల్టింగ్ ఆ ఆ...  ఓరినాయనో )

నా  మరో హృదయం  అది  నిన్ను  వదలదే ( రెండు హృదయాలా??? లేకపోతే emotional దెయ్యమా )

ఊ ..hosannah..hosannah..ఊ
ఊ ..hosannah..hosannah..ఊ..

ఎంత  మంది  ముందుకొచ్చి  అందాలుచల్లుతున్న  ఈ  గుండెకేమవ్వల ..(మేము మార్తాండ కధలు చదవట్లా మరి మాకు ఏమైనా అవుతోందా) 

హో ..నిన్నకాక  మొన్న  వచ్చి  ఏ  మాయ  చేసావే .. పిల్లిమొగ్గలేసిందిలా ..(గుండె  మొగ్గలేస్తుందా??, ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా మైండ్ బ్లాకయ్యిందా లేదా )
 
Hosannah.. గాలుల్లో  నీ  వాస
నా
..( పెర్ఫ్యూమ్ లు కొనడానికి డబ్బులు లేవా?)
Hosannah..పువ్వుల్లో  నినుచూసి
నా ..(పార్క్ లకు తిరుగుతున్నా ఎవరూ కనబడట్లేదు)
ఏ  సందు  మారి
నా
.. ఈ  తంతు  మారునా ..
నావల్ల  కాదు  ఇంకా  నన్ను  నేను  ఎంత  ఆపినా ..  
 
Hosannah.. ఊపిర్నే  వదిలేస్తున్నా ..
Hosannah..ఊహల్లో  జీవిస్తున్నా ..
Hosannah.. ఊపిరినే  వదిలేస్తున్నా ..(
శబాష్ ఇప్పుడు కాస్త అర్ధమయ్యేలా రాసావ్)
Hosannah..

Everybody wanna know what we like a we like a..I really wanna be here with you..
Is that enough to say that we r made for each other..is not that is hosannah.. true
Hosannah..be there when u r calling i will be there..
Hosannah..be the life the whole life i vl share..
I never wanna be the same..
Its time to re arrange..i take a step you take a step and me calling out to you..( నువ్వు రాసిన ఆ ఆంగ్లమేంటి  నువ్వు పాడుతున్నతాళమేంటి)

Helloo...Hellooo... Helloooo..oooo..Hosannah...


Hosaana..హా..ఆ ...
ho..sannah..హో ...
Ho..ఓ ...ఓ ..ఓఓ ..హో ..హో  హోహో ...
హో  హో  హో ..ఓ ..హో ...


రంగు  రంగు  చినుకులున్న  మేఘానివై నువ్వు  నింగిలోనే  ఉన్నావుగా..( సరే)
ఆ  తేనె గింజపళ్ళున్న  కొమ్మల్లె  పై  పైనే అందకుండా ఉంటావుగా..(నిచ్చెనేసుకోవచ్చు  కదా) 
 
Hosanna..ఆ ..మబ్బు  వానవ్వ
దా ..
Hosanna..ఆ ..కొమ్మ తేనివ్వదా ..
నా  చెంత  చేరవా ..ఈ  చింత  తీర్చవా ..
ఏమంత  నేను  నీకు  అంతకానివాన్నికానుగా ..
Helloo...Hellooo... Helloooo..oooo.. 
(కాల్ లిఫ్ట్ చెయ్యండి బే.. ఈడేవడో చంపేస్తున్నాడు)


Hosanna..
ho..sanna..ఆయువునే  వదిలేస్తున్నా..
ho..sanna..ఆశల్లో  జీవిస్తున్నా ..
hosanna...ఆయువునే  వదిలేస్తున్నా ..
ho..sanna...

ఈ పాట లో అర్ధం కాని విషయం ఏంటి  అంకులే హోసాన్నా అనే పదం..   పోసెయ్అన్న లా నాకు వినిపించి తినిపించేటప్పుడు  మింగుడుపడటం లేదు
ఇంగ్లీష్ లో రాస్తే  Rossaiah,M.F.Hussain ని మిక్స్ చేసేసి రుబ్బేసాడనుకుంటా 
ఈ పాట రైటరు కి ఇదే నా సపంచరు    

Monday, April 12, 2010

బ్లోకిరి..

ధాబా లో డిస్కషన్ జరుగుతోంది
ఒకడి బ్లాగు ని తిట్టాలి
పేమెంటు కామెంట్లు చెప్పావా, మీలో ఎవరు తిడతారు
తిట్టేది మేము కాదు, తండు
రేపు పొదున్న వాడి బ్లాగులోనే వాడి గుండెను పరిగెత్తించి పరిగెత్తించి మరీ తిడతాడు

ఆ మర్నాడు పొద్దున్న హీరో ఇంట్రో అయ్యాక
మల్లేష్ వాళ్ళ బ్యాచ్ తో గొడవ

ఒక సైబర్ కేఫ్ లో దూరారు అంతా
హీరో:టెంప్లేట్ బావుంది తిట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి

మ:ఎవడ్రా నువ్వు
హీరో: పేరు చెప్తే గాని తిట్లు  తినవా
మ:నన్నే తిట్టడానికి సుపారీ తీసుకుంటావురా నువ్వు
హీరో:ఆల్రేడి తీసేసుకున్నా ఒక్క సారి  కీ-బోర్డు దొరికితే నా చేతులు నా మాటే వినవు
మ:ఒరేయ్ అజ్ఞాత కామెంట్లు డిసేబుల్ చేయ్యురా
హీరో:కొంచెం moderation పెట్టుకో అమ్మా పారిపోవడానికి ఉంటది
మ:ముయ్ ముయ్ ముయ్ రా
తెరిచుంచాలా  రా నీ %$$%^ ఏం చేస్తావురా..
హీరో:నా బ్లాగు మీదొట్టు నీ బ్లాగు ముయ్యకపోతే నన్నడగరా 
మ:మధ్యలో నా బ్లాగేం చేసింది రా
హీరో:నిన్ను తిట్టడానికి మరి మా వదినెందుకురా 

చిన్న ఫైటు
కధానాయకుని విశ్వరూపం పాట రూపం లో

బ్లగడమే..
నా బ్లాగుని బూతుగ చూస్తే
నా రచనకు రివ్యూ రాస్తే
ఈ ప్రనా కధలను కెలికేస్తే
గగనమే....
బ్లగడమే ఏఏ... ఎయ్య్

ఎక్కడైనా నా తీరింతే ఈ వదినరాత నా స్టైలంతే   
ఈ రాత గాని చూసారంటే చలం గారు చచ్చారంటే
కధలనే ..

నా చేతికి సాగర వాటం నా ఎమోషన్ సూర్య ప్రతాపం
నా టైపింగ్ వాయువు వేగం నే బ్లాగితే తప్పదు రణరంగమ్   ఊ ఊ ఉమ్మ్
బ్లగడమే 

సాంగ్ అయ్యాక హీరో ఫ్రెండ్ సైబర్ కేఫ్ లో వాళ్ళ నాన్నకు  క్యారేజి ఇవ్వడానికి వెళ్తున్నాడు
మీరు ఇక్కడే వుండండిరా నేనొక కామెంట్ రాసేసి  వస్తా
తండ్రి :ఏరా ఎక్కడికి వెళ్ళావ్ నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావ్ మొన్న ఎక్కడికి వెళ్ళావ్ ఈరోజు కామెంట్ రాసేస్తే మర్చిపోతాను అనుకున్నావా
ఇంకో ఫ్రెండ్:ఇప్పుడే వస్తాను వుండండి రా ఒక అమ్మాయి బ్లాగు వుంది నేనూ ఒక కామెంట్ రాసేసి వస్తాను
బాగా రాస్తుంది రా ఆ అమ్మాయి  బాగా రాస్తే కామెంట్ రాసేస్తావా మనకెందుకురా  కామెంట్లు  రోజూ వంద మంది అమ్మాయిలు బ్లాగుతారు ఏ మరీ అంత బాగా రాసేస్తే ఏమి చెయ్యలేమనుకో
ఇదేంటి ఇలా ఉంది  అని అప్పుడే హీరోయిన్ బ్లాగు చూసి హీరో కామెంట్ పారేసుకుంటాడు

తర్వాత రోజు మెట్రో స్టేషన్ లో
హీరోయిన్ నడుస్తూ ఉంది
ఐ మే నాట్ బి పెర్ఫెక్ట్  బట్ మై బ్లాగ్స్ ఆర్ ఏదో సమ్ అని ఉందే
నీరసమ్
అక్కడ బ్లాగ్ ఎట్ ఫస్ట్ సైట్  అయ్యాక

ఇక్కడ తండు అంటే ఎవడ్రా నువ్వా తండు? చెప్పు బె తండు  కౌన్ హై ఇదర్  చెప్పు బె
అన్నయ్యా తండు  గాడు కావాలా ఎవడి కధ చదివితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిపోద్దో వాడే తండు గాడు అంటే నేనే అని చెప్పాడు హీరో

విలన్ నాయక్ డెన్ లోకి మన కధానాయక్ ఎంటర్ అయ్యాడు
అందరూ కలిసి వాడి బ్లాగులో  ^^&*(^&%^ అని మల్లేష్ గట్టిగా అరుస్తున్నాడు తండుని చూసి
నాయక్: మా బ్లాగులో పోస్ట్ రాస్తావా
తాండు: నేను ఎవడి బ్లాగులో పోస్ట్ రాయను,వదినెవరిదో చెప్పు కధకెంత  కామెంటుకెంత
నాయక్ :ఇన్నాళ్ళు నువ్వు వేస్తున్న  చిల్లర పోస్ట్ లు కావు, మేటర్ చాలా సీరియస్ గా వుంటుంది ఎగ్రిగేటర్లు అంటే భయపడకూడదు
తాండు: నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తావ్,నాకేదైతే భయమో వాడి పేరుని నా కధ లోకి హీరోని చేసెయ్యడం అలవాటు 
హీరో:ఈడెవడు
నాయక్: మనోడే సురేష్  ఏం
ఒక పెద్ద %^&*&**(పోలింగ్,పోలింగ్,పోలింగ్)
హీరో:మీ అడ్డాలో మీ వాడినే తిట్టాను  నన్ను తిట్టడం మీకు పెద్ద పనేం కాదు, నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదొక ఎక్సాంపుల్
ఈడినేందుకు తిట్టానంటే ఇందాక వీడు నన్ను రాంగ్ హాండ్లింగ్ చేసాడు బ్రాంది తాగి వచ్చి  నా ప్రింటర్ అదీ పట్టుకొని ఇంకెప్పుడూ అలా తేకేం
సో కధేంటి నీకెన్ని నాకెన్ని (కామెంట్లు) 
ఎల్లనా
అమ్మాయి: ఏ జీరో.. నీ బ్లాగు నాకు నచ్చింది రా
హీరో:అన్నయ్యా ఎవరీ వదిన...  ఎయ్య్ కొంచెం తగ్గు
అమ్మాయి:మోనా..... ఏ రఖ్ దో
నాయక్:కీ బోర్డు బాగా అలవాటు ఉందా బాగా తెలిసినట్టు టైపు చేసావ్
హీరో:డి టి పి సెంటర్లో చూడట్లేదేంటి
నాయక్:వీడికి చత్వారం బాగా ఎక్కువ
మోనా:మనకు కావాల్సిందీ అదేగా

మరో వితండవాదం తో నిండిపోయిన విలన్  జీప్ లో వెళ్తున్నాడు హీరోయిన్ రోడ్ మీద నడుస్తోంది
విలన్:ఏ బండాపు.. బండాపు
ఏ ఎయ్య్ నీ  పేరేంటి 
ఎక్కడికి వెళ్తున్నావ్
నీ బ్లాగు అడ్రెస్స్ రాసి ఇవ్వు
హీరోయిన్: ఎందుకు సర్
విలన్:సీనియర్స్
ఒరేయ్ ఆనంద్ టర్కీ హ్యాకర్లు మన దగ్గర నుండి ఏదో హ్యాక్ చేసేసారని ఏడుస్తూ ఉంటార్రా మన వాళ్ళంతా ఏంటిరా అదీ
పైత్యావలోకనం బ్లాగు సార్
ఎవడు చెప్పాడురా  టర్కీ వాళ్ళు హ్యాక్  చేసారని అదిగో ఈ ప్లానెట్ లో ఉంది పైత్యావలోకనం బ్లాగు
మస్తిష్కం వ్యాఖ్యలను వక్రీకరించాలని కోరుతోందిరా అరేయ్ అమలాపురం ఇది హైదరాబాద్ రా చల్ చల్ చల్ ఇంటర్నెట్ సెంటర్ కి చల్ చల్

ఇంతలో ఒకరి బ్లాగు అర్ధాంతరంగా మూసుకుపోయింది
నాగరాజు గ్రూప్  లో discussion
మూయించింది వాళ్ళే  కాని
ఖచ్చితంగా బ్లాగు మూయించింది ఆ బ్లాగు ప్రెసిడెంట్ నరేందర్ గాడే,వాడికి ఆవులు భాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది
ఏంట్రా ఆవులు భాయ్ గాడి సప్పోర్ట్, బ్లాగుల్లో ఈ నారాయణ బ్లాగులే చదవాలి  ముందు ఈ నరేందర్ గాడి  బ్లాగు మూయిన్చేయండి

రిపోర్టర్: మేము ఊ టీవి నుండి వస్తున్నాం, అడగనా సార్ (కెమెరా ఆన్ చెయ్ ఆన్ చెయ్)
బండ గణేష్: నరేందర్ బ్లాగుని మూయించింది నేనే
రి:ఎందుకు మూయించారు
బండ:పాత కక్షలు, వాడికి నాకు పడదు అందుకనే మూయిన్చేసా
రి:మరి ఎప్పుడు మీరు ఈ మూయించడం ఆపేస్తారు సార్
బండ:ఇంకా మరో నలుగురు బ్లాగర్లు వున్నారు వాళ్ళందరి బ్లాగులు మూయించి అప్పుడు ఆపేస్తాను

హీరో హీరోయిను  కలిసాక
హీరోయిన్ రాసిన ఫుల్ లెంగ్త్  పోస్ట్ చూస్తాడు హీరో
అప్పుడు వెంటనే

తిప్పి తిప్పి కడుపంత తిప్పి  వాంతి మళ్ళీ వచ్చేస్తది
పట్టి పట్టి నరాలు మెలేసి వైరాగ్యం లోకి లాగేస్తది
అసలేమయింది తెలియకుంది బాబోయ్
రాతిరంతా కునుకులేదు కధోకటి చదివానురోయ్

టర్కీ హ్యాకర్లు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరోయ్..
చెత్తరాసి చంపుతోంది ఈ ఈ...

హీరోయిన్  దగ్గర అవుతున్న హీరో ఒక రోజు లాప్టాప్ లో బ్లాస్టర్ బాల్ 3 ఆడుతుండగా
విలన్ కి ఇన్ఫర్మ్  చేసాడు వాచమన్
ఇంతకు ముందు రోడ్ మీద హార్డ్ డిస్క్ దొరికిందని అని ఇచ్చింది నువ్వే కదా,ఇప్పుడు నీకు కృతి అనే పిల్ల కూడా దొరికిందంట కదా మరి నాకు తెచ్చివ్వలేదేం?
హార్డ్ డిస్క్ దొరికిందని చెప్పానే ఆది నాదే,లినక్సు bootable డిస్క్ లు కూడా నాదగ్గరే వున్నాయి

ఎయ్ ఎయ్ ఎయ్య్ అని హీరో  మీదకు వచ్చాడు విలన్  
హీరో:నువ్వు వాడే పెన్ డ్రైవ్ లు మీ అయ్యకు లెక్కచెప్పాలి నేనేవ్వడికి  లేక్కచేప్పకర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు 

విలన్:తొందర్లోనే నువ్వు ఏగ్గ్రిగేటర్ల బ్లాగుల్లో నుండి నువ్వు పోతావ్ రా  చూస్తూ ఉండు
హీరో:నీ బ్లాగులో కొత్త follower అనుకుంటున్నావా
ఎలా మూసేసాడో చెప్పనా
ఏగ్గ్రిగేటర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడా.. పోల్స్ ఏత్తన్నారంటగా

తర్వాత సీన్ లో
బ్లాగర్ల సమావేశం గోల్కొండ ఫోర్ట్
గొడవలు తిట్లతో జరుగుతోంది సమావేశం
కొబ్బరిచిప్ప దొరికింది మన హీరో కి వెంటనే ఆ తిట్లను జతచేసి ఒక కధ రాసేసి మెయిల్ చేసాడు హీరోయిన్ కి
దెబ్బకి దిమ్మతిరిగి హీరోయిన్ కి మూర్చరోగం వచ్చి కోమా లోకి వెళ్ళాక హీరో కధలు రాయడం మొదలెట్టాడు 


హీరో ని అందరూ వెంటతరుముతున్నారు ఈ కధలను భరించలేక
ఒక సందులో దాక్కున్నాడు మన హీరో
హీరోయిన్ సడన్ గా కనిపించింది అదే దారిలో
హీరోయిన్ :ఇప్పుడు మళ్ళీ  ఏం కధ రాశావ్, ఎన్ని కధలు చదివాను నీవి
ఎన్ని సార్లు కడుపులో తిరిగింది నీ కధలు చదివి, ఇప్పుడు ఏం చెయ్యాలి నీ బ్లాగు చూడాలా మర్చిపోవాలా
హీరో: మర్చిపో 

హీరోయిన్: ఎలా మరచిపోగలను నీ బ్లాగుని
ఏ చెత్త కధ  చదివినా నువ్వే  గుర్తొస్తావ్ యాహూ  చూద్దామంటే అక్కడ కూడా నీ వీడియో లే


ఎగిరే పావురమా సినిమా చూస్తే నువ్వే గుర్తొస్తావ్
స్టువర్టపురం చూసినా నువ్వే మళ్ళీ 

ఎవరైనా తలా తోక లేకుండా మాట్లాడితే నువ్వే గుర్తొస్తావ్
ఇప్పుడేం చెయ్యమంటావ్, ఇలా ఎన్ని తప్పులు చేస్తావ్
హీరో:కృతి నీకో విషయం అర్ధం కావడం లేదు నేనెప్పుడూ కధలు రాస్తూనే వున్నాను ఇప్పుడు రాసిన కధ కూడా కొత్తదేం కాదు ఇదివరకట్లా రాసిన చేత్తకధే
ఇప్పుడు కొత్తగా తప్పు చేస్తోంది నువ్వు నా బ్లాగుని ఫాల్లో అయ్యి తప్పు చేసావ్
కాని నేను మాత్రం తప్పు చేయలేదు మంచి బ్లాగునే కెలికాను


ఒక డ్యూయెట్
గల గల బ్లాగుతున్న మార్తాండలా
విల విల లాడుతున్న బైరాగిలా..
నా బ్లాగుకై నువ్వలా అజ్ఞాత గా మారగా నాకెందుకో వున్నది రోతగా...

వైరాగ్య వానలా వాననీటిలా తారలా వర్షించి నేరుగా వాలిరాలవా నా పైన
కన్నీటి తారలా వేచి నేనిలా  చాటుగా పొమ్మన్న పోనుగా ఎంత చెప్పినా నీ ఖర్మా

ఉ ఓ ఓ ఓ  ఈ బ్లాగరి  ఊ ఓ ఓ ఓ
ఉ ఓ ఓ ఓ బాగున్నది ఊ ఓ ఓ ఓ ఓ... ఓ నో ..



ఆవుల భాయ్ వచ్చాక  తండు గాడితో మీటింగ్
ఆభా :ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించే చెప్తున్నారు నీ బ్లాగు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది రా
హీరో:నాకు కూడా
ఆభా:సరే ఏం కధ రాస్తావ్
హీరో :నేను రాయను
ఆభా:భయపడొద్దు చెప్పు ఏం రాస్తావో
హీరో:ఒకడు రాయమంటే రాయను నాకు రాయాలనిపించినప్పుడు రాస్తాను


ఆభా:ఎరా నువ్వు ఎప్పుడూ ఇంతగా తెలియకుండానే మాట్లాడుతుంటావా 
హీరో:నా మాటే అంత


ఆభా:గురువు గాడి ఇచ్చిన పబ్లిసిటీ ని  నమ్మి నీకో పని ఒప్పచెబుతున్నాను  ఒక బ్లాగులో నువ్వు తిట్టాలి తిడతావా 
హీరో:ఆ తిడతా
ఆభా:పబ్లిక్ గా అందరిముందు తిట్టాలి
హీరో:మరి వదినలు
ఆభా:తిడితే పడతారు అదే కదా మా కాన్సెప్ట్
హీరో :బ్లాగుల్లో కామెంట్లు  రాయమంటే రాస్తాను
వదినలకు వృద్ధులకు ఏం జరగకూడదు అది నా కాన్సెప్ట్
ఆభా:సరే నువ్వు తిట్టకపోతే వీడు తిడతాడు
హీరో: వాడిని కూడా తిట్టనివ్వను
నువ్వు ఓపెన్ ఐ డి తో ఎక్కువసేపు ఉండడంమంచిది కాదు ,త్వరగా బయల్దేరు

ఇప్పటికింకా బ్లావయసు నిండా  రెండేళ్ళే
చీటికి మాటికి కేలికేస్తూ చుట్టూ బ్లాగర్లే
జైసే జా  బ్లాగు చూస్తె నాకు దడపుడతా  ఉందే
జైసే జా ఆగు వదినే అసలేవడూ నీ బ్లాగే  చూడడులే
పాట అయ్యాక  
హ్యాకర్లు వచ్చి ఆవులు భాయి ఐ డి ని హ్యాక్ చేసేసారు

హీరోయిన్ కంప్యూటర్ ఓపెన్ చేసింది
హీరోయిన్:తండు ఎక్కడున్నావ్,ఎక్కడున్నావో చెప్పు నువ్వు ,నాకు తెలుసు నువ్వు ఇక్కడే వున్నావ్ అని
హీరో:ఇక్కడా ?
హీరో:తండు నేను చెప్పేది విను నువ్వు ఇక్కడే ఎక్కడో జీటాక్ లో  ఉన్నావని నాకనిపిస్తుంది
హీరోయిన్: నీ అజ్ఞాత కామెంట్లు  నా బ్లాగుకి తెలుస్తున్నాయ్
i strongly believe you are here right now
నువ్వు ఇక్కడే ఆన్ లైన్ లో ఉంటే అది నిజమే అయితే ఐ కామెంట్ యు సో మచ్ ఒకవేళ నువ్వు లేకపోతే నీ బ్లాగుని మర్చిపోవడానికి ట్రై చేస్తాను
హీరో:లేదు, నేను RGV బ్లాగులో వున్నాను
no you are a liar, you are here మై బ్లాగ్ ఇజ్  ట్రూ

హీరో:టీ చెప్పండ్రా
హీరోయిన్:ఏంటి నువ్వు rgv బ్లాగులో ఉన్నావా, rgv బ్లాగు కెళ్ళే మొహమేనా అది
హీరో:అది సరే నా అజ్ఞాత కామెంట్లు నీ బ్లాగుకి తేలుస్తున్నాయా
యిన్: మరి తేలీదా
హీరో:నాకు తెలియట్లేదే 
యిన్:ఎవరి బ్లాగులో నైనా కామెంటు పెడితే  కదా నీకు తెలియడానికి
హీరో:అయితే ఇప్పుడు కామెంట్ పెట్టాలా
యిన్:ఇప్పటిదాకి నువ్వు కామెంట్ పెడతావనుకున్నాను కాని ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను
thats why i hate you truly and completely
హీరో:కోపంగా ఉన్నట్టు వున్నావ్ తర్వాత కామెంటుకుందాం  నెట్ సెంటర్ కి వెళ్ళు పో
ఎరా నీ గౌరీ ఎక్కడ ఉందిరా అది కూడా ఇలాంటిదేనా ఇలా కామెంట్లు రాయడం లేదని వేపుకు తింటుందా
ఈ బ్లాగర్లు మనకు వేస్ట్ రా
యిన్:నువ్వు కూడా నాకు వేస్ట్
హీరో:ఎల్లమని చెప్పండ్రా ఇన్ని సార్లు లాగ్ ఇన్ అవ్వద్దు అని చెప్పండి బే

తర్వాత హీరోయిన్ ని హ్యాకర్లు నుండి కాపాడతాడు హీరో
నువ్వు నా దగ్గేరుంటే నాకే భయము లేదు
నీ బ్లాగుల్లో ఇంత కాన్ఫిడెన్సు వుంటుంది అని తెలీదు
ఐ లవ్  యు అని కలిసిపోయారు ఇద్దరూ

చూద్దంటున్నా చూస్తూనే ఉంటా నా బ్లాగు కోసం నువ్వు పుట్టావనుకుంటా
వద్దోద్దంటున్నా  వస్తూనే ఉంటా  కలకాలం నీ బ్లాగే నా ఇల్లనుకుంటా
వచ్చేయ్  రా వచ్చేయ్  రా  మార్తాండ కధలు మనకేల
రాసేయ్ రా  రాసేయ్ రా నీ చెత్త కధలు ఇకనేల
తిట్టేయ్ వా తిట్టేయ్ వా  బొట్టెట్టి నిన్ను పిలవాలా
తిట్టేయ్ వా తిట్టేయ్ వా  తిట్టేయ్ వా ..

సడియో సడియో సడియో  నేనే వస్తానుగా సడియో సడియో సడియో  నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో  నువ్వే కావాలి గా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా

ఆవులు భాయ్ మెయిల్ ఐ డి హ్యాక్ చేసాక ఎవరు చేసారో అని  ట్రేసింగ్  చేస్తున్నాడు విలన్
అప్పుడే నాజర్ దగ్గరికి వెళ్లి అడుగుతారు మీ శిష్యుడే నా మెయిల్ ఐ డి హ్యాక్ చేసారని
ఆవులు భాయ్ హీరో ఫ్రెండ్ మెయిల్ ఐ డి హ్యాక్ చేస్తారు హీరో అనుకోని

నువ్వేనేరా మార్తాండ వి కాదు అజయ్
వీడు అజయ్ అయితే మరి మార్తాండ ఎవరు
రాజ మార్తాండా ISP
2007 బ్యాచ్
badge నెంబర్ 08942
ట్రైన్డ్ at ఒరిస్సా
రాజ మార్తాండ్ కేరాఫ్ డి.టి.పి
చూసావా ఎంత గర్వపడుతున్నానో
గురువు గా ఇంతకన్నా ఏం కావాలి రా

తర్వాత తన ఇంటర్నెట్ సెంటర్ ని మార్తాండా హ్యాక్  చేసి సిస్టం  క్రాష్ చేసేశాక  ఇరవై ఏళ్ళ  ఇంటర్నెట్  సామ్రాజ్యాని కూల్చావు కదరా అని చెప్తాడు అవులుభాయ్
హీరో: సర్ మీ బ్లాగు సేఫ్ అవులుభాయ్ ఎకౌంటు  ని డిలీట్ చేసి తన సిస్టం ని క్రాష్ చేసేసాం
బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఏగ్ర్రిగేటర్ కూడా  తన ఎకౌంటు మూసేసాడు



సార్ ఏమి మాట్లాడుతున్నారు సర్
హీరో:ఒక్క సారి కధ రాయడం మొదలెడితే  నా మాట నేనే వినను


thank you

ఈ మధ్య సిస్టం లో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా చూసి బోరు కొట్టేసింది
దానికి తోడు   బ్లాగుల్లో గొడవలూ తిట్లాటలూ వెరసి ఈ టపా కి ప్రేరణ  

Sunday, April 4, 2010

జంబలకిడి Java


సందీప్ కి నాకు ఒకడే గైడ్, మా గైడ్  పోరు పడలేక జావా క్లాసు కి వెళ్ళడం మొదలెట్టాడు సందీప్
కాంపస్  దగ్గరలో ఉన్న institute లో చేరాడు
ప్రొద్దున్న క్లాస్ కి వెళ్లి వచ్చి కాలేజీ కి అటెండ్ అయ్యేవాడు

ఒక రోజు ల్యాబ్ లో
నేను: నీ కంప్యూటర్ క్లాస్ ఎలా ఉంది, అన్నీ  నేర్చేసుకుంటున్నావ్ కదా సైలెంట్ గా   

దీప్:ఏం  నేర్చుకోవడంరా బాబు ఇప్పటి వరకు ఒక ముక్క చెప్పలేదు నెలరోజులు నుండి
నేను:ఏం? బేసిక్స్ కూడా మొదలెట్టలేదా ఇంతవరకు
దీప్: ఉహూ
నేను:ఎందుకని
దీప్:డబ్బులు ఇవ్వందే వాడి స్వరపేటిక వాడట్లేదు, %^**(%&^*(

నేను:అడ్వాన్స్ ఇవ్వలేదా ఇంతవరకు,స్టైపెండ్ వచేసింది కదా ఎప్పుడో 
దీప్:హి హి హి మాకు తెలీదా,institute లో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా డబ్బులు కట్టట్లేదు,నా లైఫ్ సెటిల్ అయ్యిపోయేటట్టు ఉంది మరో నెల రోజుల్లో

నేను: నీ లాంటి వాళ్ళ వల్లేరా  మాట్రిమోనీ సైట్ లు మరుగున పడుతున్నాయ్,కాలేజీ లు పార్క్లు లా తయారవుతున్నాయ్
దీప్:నువ్వు మరీ టెన్షన్ పడిపోవద్దు లేరా మేము కాలేజీ లో కలవట్లేదు ఇప్పుడు కేవలం పార్క్ లోనే 

మా గైడ్ కి అనుమానం వచ్చేసింది  ఈ సందీప్ గాడు గాల్లో తేలిపోవడం చూసి,ఒకరోజు మమ్మల్ని క్లాసు అయ్యాక పిలిచి

గైడ్:ఏం సందీప్ ఎలా చెప్తున్నారు కోచింగ్ ,బాగా నేర్చుకుంటున్నావా
దీప్: మొదట్లో అంతా కొత్తగా ఉండేది సర్,ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నా సర్,ఒక రకం గా చెప్పాలంటే అనుభవించడానికి చాలా దగ్గరలో ఉన్నా
సర్: ఓ! గుడ్ గుడ్
నేను:$%%&**(*()()()^^$$^


అలా కాంపస్ లో ఉన్నప్పుడు కూడా,నేను జావా నేర్చుకుంటా అని కలలో కూడా అనుకోలేదు
విధి వక్రించి నేర్చుకోవాల్సి వచ్చింది

కొన్ని రోజుల తర్వాత
ప్రాజెక్ట్ పని మీద మా గైడ్ నన్ను కూడా జావా నేర్చుకోమన్నాడు కొన్ని రోజులకు ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకుంటూ ఇంట్లో డబ్బులు అడిగేసా జావా క్లాసు కి వెళ్తున్నా అని

నా దురదృష్టం కొలదీ మా సందీప్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసారు జనాలు లేక
ప్రాజెక్ట్ హడావుడి లో అంతా జావా కి ఎవరూ వచేవారు కాదు నాకు థార్పే అనే మరో అతనికి కలసి చెప్పేవారు జావా

మార్తాండని తిడితే వచ్చేవే కామెంట్లు అన్న పలంగా దొరికిందే దేవుడిప్రసాదం అనే రేంజ్ లో మాకు జావా తో పాటు c,c++, c-,c--- కూడా చెప్పేసేవాడు దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది

జావా క్లాస్ మొదటి రోజు

సర్: నువ్వేనా జాయిన్ అయ్యావు, సరే నీకు c వచ్చా
నేను:బేషుగ్గా,ధార్పే మరి నీకు
సర్:సరే నీకు c గురించి ఏం తెలుసో చెప్పు
థార్పే:C is a general-purpose computer programming languadeveloped in 1972 by Dennis Ritchie
సర్: గుడ్,ఇంకా

ధార్పే:డెన్నిస్ హ్యాడ్ ఎ  గాల్ ఫ్రెండ్ నేమిడ్ క్రిస్టో ఫర్, she is gorgeous just like scarlet Johnston and charlize theron, i just love scarlet Johnston she is tooo అంటూ మొదలెట్టాడు 
సర్: అంటే సినిమాల గురించి తప్ప ఏమి తెలీదా నీకు
థార్పే:ఉహూ


మార్తాండ కధలో వదిన క్యారక్టర్ లాగా
ఒకే  టికెట్ కి రెండు సుమన్ సినిమాల్లా మాకు మిగతా కోర్స్ లు చెప్పేవాడు

ఒక పదిహేను రోజులు వెళ్ళా క్లాస్ కి ఇంతలో ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచేస్తోంది 
మా సర్ పిలిచాడు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటయ్యా అని జావా నేర్చుకుంటున్నా అని చెప్పా, సరే మరో నెల కూడా లేదు ఇంకా అవసరం లేదులే ముందు ప్రాజెక్ట్ ఫినిష్ చేయి  అని చెప్పాడు
 
తర్వాత  రోజు
ఆరోజు హోలీ బయట షాపులు అన్నీ మూసేశారు ఏమైనా  తిందామని  కాంటీన్ కు  వెళ్ళా అది కూడా క్లోజ్
సరే ఏదో మిక్స్ వుంది పక్క రూం లో
చాల మంది కి ఫోన్ చేశా ఎలా చెయ్యాలి అని ఒక్కొకరు ఒక్కోలా చెప్తున్నారు
అప్పుడే స్టవ్ మీద పెట్టి మిక్స్  వేసి కలుపుతున్నా

ఇంతలో కంప్యూటర్ లో గేమ్ మద్యలో ఉందన్న విషయం గుర్తొచ్చి 
స్టవ్ సిమ్ లో పెట్టి. pause లో ఉన్న గేమ్ ఆడటానికి  రెడీ అయ్యా

ఒక అరగంట సేపు అన్నీ మర్చిపోయి ఆడాక సడన్ గా ఫోన్ మోగుతోంది బయట ప్రపంచం లోకి వచ్చి ఫోన్ తో వెళ్ళా స్టవ్ దగ్గరకి
ఇంటి నుండి ఫోన్ డబ్బులు వచ్చాయా అని
హోమ్: జావా నేర్చుకుంటున్నావా ? ఏమైనా వచ్చిందా
జస్ట్ ఇప్పుడే అయ్యింది డాడీ జావా నేర్చుకోవడం i am an expert now (స్టవ్ వైపు చూస్తూ)