Pages

Saturday, June 20, 2009

యూనిస్ ఖాన్


ఎందుకో వీడంటే అసలు ఇష్టం వుండదు..ఒక సగటు భారతీయుడు గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ గా వీడంటేనే పరమ ఎలర్జీ..కాని ఒక విషయం లో చాలా ఇష్టం..మ్యాచ్ గెలిచినా కూడా now ది లూజింగ్ కెప్టెన్ అనగానే అక్రమ సంభంధం లేకుండా మ్యాచ్ గెలిచినా కూడా బహుమతి వేడుక దగ్గరకు చెంగు చెంగున పరుగేడతాడు.. అంత బాగా ఇంగ్లీష్ వుంటుంది..నేనయితే బాలయ్య కామెడీ సినిమా లను యూనిస్ ఖాన్ ఇంగ్లీష్ మాటలను మిస్ అవ్వడం ఒక పాపం గా భావిస్తా.. యూనిస్ కి ఇంకో ఇంగ్లీష్ బూతు కి బాగా దగ్గరపోలిక వుండడం వల్ల కంమేంటేటార్స్ తో సహా పాకిస్తాన్ ప్రజలకి కూడా అంత ఇష్టం వుండదు అనుకుంటా

కొంచెం క్లోజ్ గా అబ్జెర్వ్ చేస్తే ఒక టాం హాంక్స్ + ఒక మాట్ డామన్ = యూనిస్ ఖాన్

ఒక చిన్న కోరిక నాకు

రేపు T20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సూపర్ ఓవర్ దాకా వచ్చిన పర్వాలేదు కానీ గెలవకూడదు
తర్వాత యూనిస్ ఖాన్ గాడు ప్రెజెంటేషన్ సేర్మోనీ లో

లూజింగ్ కెప్టెన్ అనగానే..

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
అని గబగబా చెప్పేయాలి.. ఎంత బావుంటుందో

అప్పుడే నాకు మనస్సాంతి..



కనీసం "ఖానూ,యూనిస్ ఖానూ..నీవూ మావలె మనిషివని అంటే ఎలా నమ్మేది.. నీకు ఓటమి తప్పదని...
ఖానూ" అని చివర్లో అలెన్ విల్కిన్స్ ఎస్ పి బాలు లా గొంతు చించుకొని ఒక పాట పాడినా ok..

నా కోరిక తీరాలంటే రేపటి దాక ఆగాల్సిందే ! ఏం జరుగుతుందో ?



14 comments:

Shashank said...

లంక గాళ్ళు బాగాడుతున్నారు. రెండో సారి మిస్ బాహ్ గాడూ సిక్స్ కొట్టబోయి ఈ సారి మలింగా గాడికి క్యాచ్ ఇస్తే రచ్చ. ఇంక పాక్ కి వాడ్ని రానివ్వరు. :) అలానే నే జాన్-ఎ-మన్ యూనస్ ఖాన్ ని కూడా.

vinod said...

పాకిస్తాన్ క్రికెటర్లలో నాకు బాగా నచ్చేది యూనిస్‌ఖానే.మైదానంలో ఉన్నప్పుదు బాట్స్‌మాన్ గానైనా ఫీల్డింగ్ కప్టెన్ గా ఐనా coolగా నవ్వుతూనే వుంటాడు.
ఇండియా మీద చాలా మ్యాచ్ లు సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడు.
ఒకసారెప్పుడో ఇండీయా తో మ్యాచ్ లో సెంచురీనో డబుల్ సెంచురీ నో కొట్టి పిచ్ మీదే మూడు పుష్ అప్స్ తీసాడు.ఆటని ఆటలాగానే చూడాలనే sportive spirit
ఉన్నవాడు.

హరే కృష్ణ said...

@శశాంక్ హత విధి నా కోరిక తీర్లా..!

హరే కృష్ణ said...

@వినోద్ గారు
సిక్స్త్ సెన్స్ చాలా బావుంది మీకు ..కంగ్రాట్స్

Anonymous said...

okasaari vizaglo jarigina match lo----"How is the Hospitality here?" ani adigite, younis gaadu "Yes, the hospitals here are very good, they cured my injury in one day" ani cheppadu.....Aa point okkate miss ayyavu

హరే కృష్ణ said...

హ హ హ్హ..బాబోయ్ ఇంత చరిత్ర వుందా వీడి దగ్గర.. ఈ డైలాగ్ ఇప్పుడే తెలిసింది ఇంత మంచి డైలాగ్ ని మిస్ అవ్వడం ఒక పాపం గా భావించి మరో పోస్ట్ రాసేస్తా
చాలా థాంక్స్ రవి.

Aditya Maddula said...

Back with a bang ante idenemo... Baga Rasav... Pravaruni swagatam lo padyam inka gurthundaa ra babu? neeko dannam.. :D

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

younis ane daantlo boothu emundi?? gmail lo naaku cheppu. nee post mahatyam pak gelichindi, younis retire aiaadu

హరే కృష్ణ said...

@Aditya
హమ్మయ్య..థాంక్స్ ఆదిత్య ..స్మాల్ బాంగ్ ఏమో..చిన్నప్పుడు పిడి దొబ్బాను కదా అలా ఫ్లో లో వచ్చేసింది ..:)

హరే కృష్ణ said...

@Vikram
విక్రం.. రజాక్ గాడు రచ్చ చేస్తాడని వుహించలేకపోయా శ్రీలంకకి సినిమా చూపించాడు అయా ఉదానా అంత అధ్వాన్నంగా వేసేసరికి దేవుడు కూడా కాపాడలేకపోయాడనుకుంటా
వాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే మనకు ప్రశాంతి విజయశాంతినూ

karthik said...

super andi.
naku chala ishtamaina padyam pettinanduku nenarlu.

-Karthik

Kista said...

చాల కృతజ్ఞ్యతలు ఈ పద్యం మల్లి నేను చదువుతాను అనుకోలేదు నాకు చాల చాల ఇష్టమైన పద్యం అందుకు మీకు చాల ...అంతే ..

Mystic Me said...

This is the only poem I remember from my high school time. Somehow I like it a lot..It feels good to me to tell it to myself to assert my commitment to my mother tongue.

Chenna Reddy Cotla
PhD Student
Washington, DC